ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;కాజీపేట లోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా ప్రతి సంవత్సరం మే నెలలో కార్మిక మాస ఉత్సవాలను దిగ్విజయంగా జరుపుకుంటున్నామని తెలిపారు. గతంలో మనం చూసినట్లయితే గత ప్రభుత్వాలు కార్మికులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని తెలంగాణ వచ్చినంక కార్మికుల బాగోగులు చూస్తూ , కార్మికుల శ్రేయస్య ధ్యేయంగా ముందుకు వెళుతుందని తెలిపారు. కార్మిక మాస ఉత్సవాలు జరుపుతుంటే ఒకానొక సందర్భంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను పిలుచుకొని కార్మిక మాసోత్సవంలో ఏం చేస్తారు అని అడిగారని, కార్మికుల శ్రేయస్య ధ్యేయంగా కార్మికుల పిల్లలు కార్మికులుగా జీవించకూడదనే ఉద్దేశంతో ఈ మాసోత్సవాలు నిర్వహించి వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిలో మనోధైర్యాన్ని నింపడమే కార్మిక మాసోత్సవ ఉద్దేశమని అన్నారు. కార్మిక భవనాల నిర్మాణం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా మన ప్రభుత్వం నిర్మాణాలకు అనుమతి ఇచ్చి, ఆ భవనాలలో టాస్క్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. భవన నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు ఆరో తారీఖున కేటీఆర్ చేతుల మీదుగా ఆ నిధులను అందిస్తామని తెలిపారు. సంఘటిత అసంఘటిత కార్మికులు ఐక్యంగా ఉండి కార్మికుల పురాభివృద్ధి కోసం కష్టపడుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీని, నన్ను ఆశీర్వదించాలని అన్నారు.
Post A Comment: