ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

45 వ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ , బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2023-24 సంవత్సరానికి క్రీడా  పోటీలను నేటి నుండి ఈ నెల 5 వరకు  హన్మకొండ జెయెన్  స్టేడియం లో ఏర్పాటు చేసారు . ఈ క్రీడా పోటీలను తెలంగాణ ట్రాన్స్కో ఆండ్  డిస్కమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు .  ఈ పోటీలకు మన భారతదేశం నుండి వివిధ రాష్ట్రాలు పాల్గొంటున్నాయి . వీటిలో కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్  , కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు , తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు, ఉత్తరప్రదేశ్ పవర్ సెక్టార్ , ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ , తెలంగాణ ట్రాన్స్కో అండ్  డిస్కమ్స్ 12 టీంలు , 160 క్రీడాకారులు   పాల్గొంటున్నారు .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్  అన్నమనేని గోపాల్ రావు విచ్చేసి మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూల మాల  వేసి , స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన జెండా ను ఆవిష్కరించారు.

అనంతరం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన వారు సీఎండీ  కి  గౌరవ వందనాన్ని తెలిపారు.

తదనంతరం సీఎండీ అన్నమనేని గోపాల్ రావు  మాట్లాడుతూ క్రీడలకు వరంగల్ పెద్ద పీట  వేస్తుందని , వరంగల్ తెలంగాణ లో క్రీడలకు మకుటం గా నిలుస్తుందని  ఇక్కడా క్రీడా  పోటీలను ఏర్పాటు చేయడం చాల సంతోషంగా ఉందని అన్నారు. వివిధ రాష్ట్రాల నలు మూలాల నుండి ఇక్కడి వచ్చి పాల్గొనడం తెలంగాణ కు గర్వకారణామని తెలిపారు . ఇలా వివిధ రాష్ట్రాల నుండి రావడం మూలాన సత్  సంబంధాలు మెరుగు పడుతాయని , సాంస్కృతిక , కళల కి దోహద పడుతుందని పేర్కొన్నారు . మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజున   ఈ కార్యక్రమం జరపడం ఆనందంగా ఉందని అన్నారు. ఆట పోటీల్లో పాల్గొనడం వలన  ఆరోగ్యం , మానసిక ప్రశాంతత , ఫిట్ నెస్  చేకూరుతుందని అన్నారు . గెలుపోటములు సహజమని అందరు టీం స్పిరిట్ తో ఆడాలని పిలుపునిచ్చారు . ఏషియన్ గేమ్స్ లో ఎన్నో పథకాలు భారత దేశం సాధించిందని ఈ సందర్బంగా తెలిపారు .

భారత దేశంలో కబ్బడి, ఫుట్ బాల్ , వాలి బాల్ కు అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపారు . వరంగల్ వాసి ఐన పిచ్చయ్య  బాల్ బ్యాడ్మింటన్ లో రాటుతేలిండని  అన్నారు . ట్రాన్స్కో , డిస్కమ్స్  ఇదివరకు జరిగిన పోటీల్లో కరీంనగర్ , వరంగల్ చాల ఆటల్లో గెలిపొందారని తెలిపారు .

ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు శ్రీ . బి. వెంకటేశ్వర్ రావు , సంధ్య రాణి , చీఫ్ విజిలెన్సు ఆఫీసర్ బి . జనార్దన్  , ఆల్ ఇండియా  ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు  ప్రధాన కార్యదర్శి కె ఆర్  శివ కుమార్ , స్పోర్ట్స్ ఆఫీసర్ ఏ.పి  ట్రాన్స్కో , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా  ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు  టి.డి  కుమార్ వడివేలు , సీజియం  మోహన్ రావు , వరంగల్ ఎస్ ఈ  మధుసూదన్ , డిఈ  లు , విజయేందర్ రెడ్డి ,  సాంబ రెడ్డి , ఆనందం , స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్   ఎన్ జగన్నాద్, కె . వి  జాన్సన్, తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: