ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హన్మకొండ, పబ్లిక్ గార్డెన్స్ లో వారి విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మెన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్త పట్నాయక్, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
ప్రపంచంలోని భారతీయులందరికీ మహాత్మాగాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
బ్రిటిష్ వారి నుండి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుడు, సత్యం, అహింస మార్గాన స్వాతంత్ర్యాన్ని సాధించి, ఏదైనా చేయగలం అని నిరూపించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.
గాంధీ చూపిన అహింసా మార్గంలో స్వరాష్ట్రం సాధ్యం చేసి, వలసలు తగ్గించిన మహనీయుడు మన సీఎం కెసిఆర్.
దేశానికి గాంధీజీ స్వాతంత్య్రం తెస్తే, మన రాష్ట్రానికి కెసిఆర్ స్వాతంత్ర్యాన్ని తెచ్చారు.
తెలంగాణ గాంధీ సీఎం కెసిఆర్
గాంధీజీ కన్న కలలు సాకారం చేసింది సీఎం కెసిఆర్.
గాంధీ ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలని కోరుకునేవారు.
గ్రామాల్లో వలసలు తగ్గినప్పుడే గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది.
సీఎం కేసిఆర్ మహాత్మాగాంధీ మాటలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ది చేస్తున్నారు.
ప్రతి గ్రామాన్ని కడిగిన ముత్యంలా తయారు చేశాం.
మన గ్రామాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాము.
స్వచ్ఛ భారత్ లో మన రాష్ట్రమే నంబర్ 1
ఆదర్శ గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తే మన రాష్ట్రమే నంబర్ 1
దేశంలో సంపూర్ణ ఓడిఎఫ్ రాష్ట్రం కూడా మన తెలంగాణనే ఇవే గాక రైతులకు నూతన రెవెన్యూ చట్టం,రైతు బంధు,రైతు భీమా లాంటి పథకాలతో రైతుల కష్టాలు తీరుస్తున్నారు.
మరోసారి గాంధీజీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Post A Comment: