ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;తెలంగాణ వైతాళికుడు, ప్రజా కవి కాళోజి నారాయణరావు పేరిట నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రంలోని ఆర్ట్ గ్యాలరీని 6 తేదీన మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం భాస్కర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజు యాదవ్ తో కలిసి కాళోజీ కళాక్షేత్రాన్ని పరిశీలించారు. కాళోజీ చిత్రమాలికలు కాళోజీ జీవిత చరిత్రను తెలిపేలా ఫోటో ఎగ్జిబిషన్ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాళోజి ఆర్ట్ గ్యాలరీ విషయంలో కాళోజి ఫౌండేషన్ సభ్యుల సూచనలు సలహాలు పాటించాలని కూడా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కూడా వైస్ చైర్మన్ షేక్ రిజ్వాన్ బాషా పిఓ అజిత్ రెడ్డి ఈఈ భీమ్రావు, కార్పొరేటర్లు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: