ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల ప్రవర్తనా నియమావళినిపకడ్బందీ గా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులకు సూచించారు.
మంగళవారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎంసిసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలుపరిచే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, సర్వైవల్ స్టాటిస్టికల్ టీమ్, వీడియో సర్వైవల్ టీమ్, వీడియో వీవింగ్ టీములకు సంబంధించిన అసిస్టెంట్ ఎక్స్పెండీచర్ పరిశీలకులకు దిశా నిర్దేశం చేసారు .
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల అధికారులు సరైన శిక్షణ పొంది ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడానికి కృషి చేయాలని, అందుకు తగిన విధంగా శిక్షణ అవగాహన పొందాలని సూచించారు .ఎన్నికల మార్గదర్శకాలను సంపూర్ణం గా అధ్యయనం చేయాలి అని అన్నారు ఎన్నికల నిబంధనలను ఎవరూ అతిక్రమించకుండా చూడాలని, ఎన్నికల కోడ్ అమలు లోనికి వచ్చిన క్షణం నుండే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లోనికి వస్తుందని, అందుకు గాను ఎన్నికల నిబంధనలను పాటించే విధానంపై ఈరోజు నుండే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని, అందుకు మీరు నియోజకవర్గం, మండల స్థాయిలలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎన్నికల నిబంధనలు, సమాచారం మీ వద్ద ఉండాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన పెంచుకోవాలని, ఎలక్షన్ విధుల పట్ల సీరియస్ ఎఫర్ట్ పెట్టాలని, మీతో నియమింపబడిన సహ అధికారులతో మంచి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు.ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన మొదటి రోజు నుండే 100 శాతం పనులు మొదలుపెట్టేలా సిద్ధం కావాలని, ఎన్నికల రిపోర్టులు సకాలంలో సమర్పించేలా పనితీరు పెంపొందించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో విద్యుత్తు, టాయిలెట్లు, మంచినీరు, ఫర్నిచర్, వసతులు పూర్తి అయ్యేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది అందరూ కమిషన్ ఆధీనంలో పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని కాబట్టి ఎలక్షన్ ప్రశాంతంగా ముగిసేందుకు సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది సమన్వయంతో సమస్యలు తలెత్తకుండా సజావుగా విధులు నిర్వహించాలని అన్నారు.
శిక్షణా కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ట్రైని కలెక్టర్ శ్రద్ద శుక్ల, డిఆర్డిఏ పీడి శ్రీనివాస్ కుమార్, జడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ , నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: