ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆధునిక వసతులతో 7.5 కోట్ల నిధులతో నిర్మించినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ తెలిపారు. జిల్లా ఆర్ అండ్ బి ఉన్నతాధికారులతో మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈనెల 6న కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జి ప్లస్ మూడు అంతస్తులతో ఆధునిక వసతులతో నిర్మించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: