ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువులను తిరిగి అప్పగించాలంటే తగిన ఆధారాలు చూపించాలని, గ్రీవెన్స్ కమిటీ త్వరితగతిన కేసుల పరిష్కారం ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, సిక్త పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గ్రీవెన్స్ కమిటీ సమావేశన్ని కలెక్టర్ నిర్వహించారు.
ఈ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ రూ.50వేలకు మించి రూ.10లక్షలకు లోపు నగ, లేదా బంగారం, వెండి, ఇతర వస్తువులకు సంబంధించి ఆధారాలను కలెక్టరేట్ లోని 2వ అంతస్తు రూమ్ నంబర్ ఎస్21 గల గ్రీవెన్స్ కమిటీకి ఆపిల్ చేస్తే వాటిని పరిశీలించి వెంటేనే విడుదల చేస్తుందన్నారు. రూ.10లక్షల కన్నా మించిన వాటికి సంబంధించిన నగదును, బంగారం, వెండి, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్న కేసుల్లో ఆదాయ పన్ను, వాణిజ్యా పన్నుల శాఖలకు సమాచారం అందించిన తర్వాత వారి నుండి క్లియరెన్స్ రాగానే గ్రీవెన్స్ కమిటీ విడుదల చేస్తుందని చెప్పారు. పోలీసు అధికారులు స్వాధీనం పరుచుకున్న సొమ్మును కచ్చితంగా రశీదు ను అందించడంతో పాటు గ్రీవెన్స్ సెల్ కి ఎండార్స్ చెయ్యాలని ఆదేశించారు.
ఈ సమావేశం లో ట్రైనీ కలెక్టర్. శ్రద్ధ శుక్లా, పి.డి డి.అర్.డి.ఓ శ్రీనివాస్ కుమార్, డి.సి.ఓ జి.నాగేశ్వర రావు, డి.టి.ఓ జి.రాజు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: