ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ లోని ఏనుమాముల మార్కెట్ ఆవరణలో గల ఈవీఎం గోదాంను శుక్రవారం కలెక్టర్ సిక్త పట్నాయక్ అదనపు కలెక్టర్ మహేందర్ జీ తో కలిసి తనిఖీ చేశారు. ప్రతీనెల చేసే తనిఖీల్లో భాగంగా వారు సందర్శించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవిఎం, వివిప్యాట్ గోడౌన్ ను క్షుణ్ణంగా తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కలెక్టర్ ఈవిఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈవిఎం గోడౌన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించినారు. ఈవిఎం గోడౌన్ వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీస్తూ ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా గోడౌన్‌లోనే పూర్తిస్థాయిలో సదుపాయాలు కలిగి ఉన్న గదుల్లో భద్రపర్చాలని, ఏ చిన్న వస్తువు కూడా బయటికి వెళ్లకుండా నిఘా ఉంచాలన్నారు. షార్ట్‌సర్క్యూట్‌కు ఆస్కారం లేకుండ చూడాలి అని కలెక్టర్ అన్నారు.


Post A Comment: