ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;నీటిపారుదల శాఖ అధికారి ఇచ్చిన పిటీషన్ మేరకు పోలీసులు మహదేవ్‌పూర్ పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ 174/2023 యూ/ఎస్ ఐపీసీ427, సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ నమోదు చేశారు.
22న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 21న 18.30గం.లకు ఎల్‌అండ్‌టి కార్మికులు వంతెన వంగినట్లు గమనించడంతో పాటు పీర్ అంటే పిల్లర్‌లో పగుళ్లు కనిపించాయని, ఈ అంశంపై అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని నీటిపారుదల శాఖ ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే తెలిపారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్‌లు, క్లూస్ టీమ్‌ల ద్వారా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారని. ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిపుణుల కమిటీ బ్యారేజీని పరిశీలించిందని, నిపుణుల కమిటీ నిర్ధారణ తర్వాత పోలీసులు ఓ నిర్ధారణకు రానున్నారని ఎస్పి తెలిపారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన అభ్యర్థన మేరకు, భద్రతా సమస్య, ప్రమాదాల నివారణ కోసం మెడిగడ్డ బ్రిడ్జి పై నుంచి రాక పోకలు నిలిపివేశామని ఎస్పి కిరణ్ ఖ రే పేర్కొన్నారు.

Post A Comment: