ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఈనెల 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నగరానికి విచ్చేసి, కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అంతకుముందు కాళోజి కళాక్షేత్రం పబ్లిక్ గార్డెన్, పోతన నగర్, సమ్మయ్య నగర్, నయీమ్ నగర్ తోపాటు పలు జంక్షన్ లలోని చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య రాష్ట్రంలో కాలోజీ మిత్రమండలి వారు కాళోజీ కళాక్షేత్రం కొరకు పలుసార్లు విన్నవించిన సమైక్య పాలకులు కజం చాగ కూడా ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. 2010లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు కాళోజీ నారాయణరావు చేసినటువంటి కృషికి కళాక్షేత్రంతోపాటు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తనని అప్పటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు అన్నారు. దేశంలోనే అంత గొప్ప కళాక్షేత్రం ఎక్కడ కూడా ఉండదని అన్నారు. ఎప్పుడో ప్రారంభం కావలసినటువంటి కళాక్షేత్రం కొన్ని కారణాలవల్ల కొంచెం లేట్ అయిందని అన్నారు. కొన్ని డిజైన్లు మార్చి అధునాతన పద్ధతులను క్రోడీకరించి బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారని అన్నారు. కాళోజీ మిత్రమండలి కాళోజి ఫౌండేషన్ సభ్యుల అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.90% పనులు పూర్తయ్యా అని ఇంకా 10 శాతమే ఉన్నాయని కానీ కాలోజీ జయంతి సందర్భంగా ఆరోజు కార్యక్రమాన్ని మంత్రి కేటి రామారావు ప్రారంభిస్తున్నారు అని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లు డ్రైనేజీలు దెబ్బతిన్నాయని అందుకోసం ఇటీవల 20050 కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అంతేకాకుండా 19 ప్రాంతాలలో 19 జంక్షన్ లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో 2020లో కూడా వరదలు వచ్చినప్పుడు సమ్మయ్య నగర్,నయీమ్ నగర్, జవహర్ నగర్ పూర్తిగా ధ్వంసం అయ్యాయని వాటి నిర్మాతల కోసం అప్పుడు 75 కోట్ల రూపాయలు హెచ్చించి మరమ్మత్తులు చేయడం జరిగిందని తెలిపారు. వరదల వచ్చినప్పుడు మంత్రి వచ్చినప్పుడు 100 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. అప్పుడు కూడా 250 కోట్ల నిధులతో పను నాళాలను అభివృద్ధి చేశాము కాబట్టి ఇంత పెద్ద వరదలు వచ్చినా కూడా ఎక్కువగా నష్టం జరగలేదని అన్నారు. అక్కడక్కడ నష్టం జరిగిందని తెలిపారు.సమ్మయ్య నగర్ నాలా పక్కన ఉన్నటువంటి కాలువ తెగడం వల్ల అక్కడున్నటువంటి 240 ఇల్లు సంసమయాయని తెలిపారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో తొమ్మిది ఫ్లోర్ల తో నిర్మించి ఆ ఇళ్లను బాధితులకు కేటాయిస్తామని తెలిపారు. అందులో పెద్దమ్మ గడ్డ రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోయినటువంటి వారికి కూడా ఇల్లు కేటాయిస్తామని తెలిపారు. ఆర్ అండ్ బి మున్సిపల్ కూడా రెవిన్యూ అధికారులతోని సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కార్మికుల కోసం 5 అడ్డాలు ఉన్నాయని, కార్మిక భవనం కోసం స్థలం కేటాయించి, వారికోసం షెల్టర్స్ నిర్మాణం చేపడతామని తెలిపారు. అడ్డా కార్మికులకు కూడా ఎండలో ఎండకుండా వానకు తడవకుండా, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక మాడల్ గా షెల్టర్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ మధ్యకాలంలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇళ్ల స్థలాలు కూడా లేనివారికి ఇల్లు కేటాయిస్తామని తెలపడం జరిగింది దాన్ని కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్,ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్, ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, వైస్ చైర్మన్, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాష, జేసీ మహేందర్ జీ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: