మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు దేవునూరి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో సిగ్మా హాస్పిటల్ వారి హెల్త్ కార్డుల జారీస్థానిక ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్ జ్యోతినగర్ హమాలీ సంఘం, అన్నపూర్ణ కాలనీ ట్రాలీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ సంఘాల సభ్యులకు బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు దేవునూరి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణం లోని ఫార్చ్యూన్ సిగ్మా హాస్పిటల్ వారి హెల్త్ కార్డ్స్ 150 మంది అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి *బీఎస్పీ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్-చార్జ్ గోలివాడ ప్రసన్నకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ "రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పేద బడుగు బలహీన వర్గాల, బహుజన కార్మికులకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడానికి, వారికి లబ్ధి చేకూర్చే విధంగా 10,000 కుటుంబాలకు సిగ్మా హాస్పిటల్ వారిచే హెల్త్ కార్డులను జారీ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా సిగ్మా హాస్పిటల్ సీఈవో యం.నరేష్ మాట్లాడుతూ "బీఎస్పీ పార్టీ తరపున మేము రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 10,000 కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నామని, అలాగే వెనుకబడిన ప్రాంతాలలో 100 హెల్త్ క్యాంపులను నిర్వహించబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జింక ఉదయ్, జనగామ మల్లేష్ , కాసర్ల పోషమల్లు, మడ్డి చంద్రయ్య, చిలుక బానేష్,ఆడెపు శ్రీనివాస్, మడ్డి బబ్రువాహన్, రఘునాథరెడ్డి, సంతోష్, లంక మల్లేష్, రామిల్ల సతీష్ పెరుక కిష్టయ్య లతో పాటు అధిక సంఖ్యలో హమాలీ కార్మికులు, ట్రాలీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Post A Comment: