ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు అధికారులు చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కరించాలని, బాధితులకు అండగా ఉంటూ, సమగ్ర విచారణ జరిపి ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివాస్ కార్యక్రమం సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన 17 మంది ఫిర్యాదులను ఎస్పి స్వీకరించారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఎస్పి మాట్లాడారు. పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడంతో పాటు బాధితులకు న్యాయం చేయడంలో సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుదారులు భూ పంచాయతీలు, సివిల్ పంచాయతీలు సాధ్యమైనంత వరకు కోర్టులో పరిష్కరించుకోవాలని ఎస్పి సురేందర్ రెడ్డి సూచించారు.

Post A Comment: