ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

నెహ్రు యువ కేంద్ర వరంగల్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సౌజన్యంతో హనుమకొండ జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ వడ్డేపల్లి పింగిలి మహిళా డిగ్రీ కళాశాలలో  ఏర్పాటు చేస్తున్న జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం  లో యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెహ్రు యువ కేంద్ర  జిల్లా యువజన అధికారి చింతల అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సీక్తా పట్నాయక్,  ఎన్ వైకే  యూత్ ఆఫీసర్ చింతల అన్వేష్ మరియు జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్  లతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు.

 భారతదేశానికి స్వాతంత్ర సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని, ఆదర్షాలను, విలువలను వ్యాప్తి చేయడానికి, విభిన్న సంస్కృతుల మధ్య ఐక్యతను సాధించేందుకు, జిల్లాస్థాయిలో  సాంస్కృతిక,  వకృత్వ,  పెయింటింగ్, పద్య రచన మరియు మొబైల్ ఫోటోగ్రఫీ అనే 5 రకాల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు గురువారం ఈనెల  6 న  సమయము ఉదయం 9 గంటల నుండి  ప్రారంభమవుతాయి.  యువతి యువకుల వయసు 15 నుండి 29 సంవత్సరాలు లోపు ఉండాలని,  ఒక్కరు ఒక్క పోటీలో మాత్రమే పాల్గొనాలని,  యంగ్ రైటర్స్ కాంటెస్ట్, యంగ్ పెయింటింగ్ ఆర్టిస్ట్ కంటెస్ట్ మరియు మొబైల్ ఫోటోగ్రఫీ  పోటీలకు ప్రధమ నగదు బహుమతి 1000/- రూపాయలు,  ద్వితీయ నగదు బహుమతి 750/- రూపాయలు,  తృతీయ నగదు బహుమతి 500 రూపాయలు కాగా వకృత పోటీ (డిక్లమేషన్ కాంటెస్ట్) ప్రథమ నగదు బహుమతిగా 5000/- రూపాయలు, ద్వితీయ నగదు బహుమతి 2000/-  రూపాయలు, తృతీయ నగదు బహుమతి 1000/- 

 మరియు డిస్టిక్ కల్చరల్ ఫెస్టివల్ గ్రూప్ ఈవెంట్ పోటీ విజేతలకు ప్రథమ నగదు బహుమతిగా 5000/- రూపాయలు, ద్వితీయ నగదు బహుమతి 2500/- రూపాయలు, తృతీయ నగదు బహుమతి 1250 రూపాయలు  చొప్పున అందజేయ బడుతుందని తెలియజేశారు. పై విధంగా వివరింపబడిన అన్ని పోటీలకు అంశం పంచప్రాన్ అమృత్ కాల్ లోని ఐదు అంశాలుగా నిర్ణయించబడింది. డిస్టిక్ కల్చరల్ ఫెస్టివల్ పోటీలో  పాల్గొనే బృందాలు జానపద,  సంప్రదాయ నృత్య రూపాల్లో మాత్రమే ప్రదర్శనలు ఇవ్వవలసి ఉంటుంది. డిక్లమేషన్ పోటీ హిందీలో గాని ఇంగ్లీషులో గాని ఏడు నిమిషాలు పరిమితితో ఉంటుంది. కవిత రాయటం తెలుగు హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. పై పోటీలలో పాల్గొనదలుచుకున్న సభ్యులు ముందుగానే ఈ క్రింది ఆన్లైన్ లింక్ ద్వారా  https://forms.gle/i731NzteFpzeTSYPA రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఒక్కొక్క కాంపిటీషన్లో పరిమితితో కూడిన నిబంధనలు ఉండటం వలన సత్వరమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మరిన్ని వివరాలకు 0870-2958776  +91 99080 69469 9700409497 ఫోన్ నెంబర్ లలో కానీ లేదా  హనుమకొండలోని న్యూ బస్టాండ్ సమీపంలో గల నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో గాని సంప్రదించాలని జిల్లా యువజన అధికారి చింతల అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: