చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పట్టణంలోని పద్మావతి
ఫంక్షన్ హాల్ లో ఈనెల 4వ తేదీ
ఉదయం 10 గంటలకు నిర్వహించే
మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్ర
మంలో అన్ని స్థాయిలలో ఉన్న బిజెపి
ముఖ్య నాయకులందరూ పాల్గొని
విజయవంతం చేయాలని ఆ పార్టీ మాట్లాడుతున్న అసెంబ్లీ కన్వీనర్ బిక్షంగౌడ్
మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల
బిక్షం గౌడ్ తెలిపారు. చౌటుప్పల్లో సోమవారం నిర్వహించిన పార్టీ ముఖ్య
నాయకుల సమావేశంలో పాల్గొన్న బిక్షం గౌడ్ మాట్లాడుతూ మేరా బూత్ సబ్సే
మజ్బూత్ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని నాయకులకు మార్గ నిర్దేశం చేయడం జరుగుతుందని, విజయవంతం చేయాలని కోరారు. పార్టీ బలోపేతం కోసం కృషిచేసిన విస్తారకులు చైతన్య, చంద్రశేఖర్ గౌడ్లను బిక్షం గౌడ్ అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రమణ గోని శంకర్, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, నాయకులు గుజ్జుల సురేందర్రెడ్డి, దాసోజు బిక్షమా చారి, పాలకూర్ల జంగయ్య గౌడ్, గోశిక పురుషోత్తం, నీరజ, ఎర్రగొని శ్రీధర్, సత్య నారాయణ, బాతరాజు లింగస్వామి. గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: