చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గల
గాంధీ పార్క్ లో ఉన్న ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో, చౌటుప్పల్ ట్రాఫిక్
సర్కిల్ ఇన్స్పెక్టర్ లు రాచకొండ సైదులు, విజయ మోహన్ ఆధ్వర్యంలో సిపిఆర్
శిక్షణ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
సిపిఆర్ శిక్షణ కార్యక్రమాన్ని గురించి చౌటుప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర
వైద్యాధికారి డాక్టర్ కాటంరాజు ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ సిబ్బందికి, హెూటల్
సిబ్బందికి, మెకానిక్ లకు, దుకాణదారులకు ఇతరులకు శిక్షణ అందజేశారు.
సిపిఆర్ శిక్షణ తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి ప్రాణం పోయేవచ్చని డాక్టర్ కాటంరాజు
తెలిపారు. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశ్విని కుమార్, డాక్టర్ జయంత్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్లు కిష్టయ్య, జానయ్య కళాశాల కరస్పాండెంట్ సిలివేరు ధనలక్ష్మి, ప్రిన్సిపాల్ సిలివేరు
శ్రీనివాస్, అధ్యాపకులు భరత్, పూజ, మమత, పూజ, డిల్లీ శేఖర్ రెడ్డి, బొమ్మ
లింగస్వామి, తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: