మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ ఫీజు వందశాతం రాయితీ ఇవ్వాలని టీ డబ్ల్యు జే ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోగుల విజయ్ కుమార్, సుంక మహేష్ లు కోరారు.ఫీజు రాయితీ విషయమై శుక్రవారం డీ ఈ ఓ కార్యాలయం సూపరిండెంట్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్ట్ వృత్తిని నమ్ముకుని నిత్యం ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారధిగా వుంటున్న జర్నలిస్ట్ లు చాలీ చాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అర్హులైన జర్నలిస్టుల పిల్లలకి స్కూల్ ఫీజులో
రాయితీ అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా సభ్యులు నూక రామదాసు, సుంక శ్రీధర్, పల్ల మహేష్,షాబీర్ భాష, గోపికృష్ణ, సుమన్, సబ్బు సతీష్, సంతోష్, సీనియర్ జర్నలిస్ట్ మధులతో పాటు పలువురు పాల్గొన్నారు.

Post A Comment: