ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం శ్రీ భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు.
శనివారం ఉదయం హెలికాప్టర్ ద్వారా మామునూరు హెలిప్యాడ్ వద్దకు ఉదయం 10.12 గంటలకు చేరుకున్న ప్రధాని మోడీ ఉదయం 10.36 గంటల ప్రాంతంలో రోడ్డు మార్గంలో శ్రీ భద్రకాళి దేవాలయ ఆవరణకు చేరుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆలయ అర్చకులు , అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ప్రధాని నరేంద్ర మోడీ గో సేవ లో పాల్గొని ఆవులకు గ్రాసం తినిపించారు.
అనంతరం భద్రకాళి ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఉదయం 11 గంటలకు భద్రకాళి ఆలయం నుంచి ఆర్ట్స్ కాలేజ్ కు ప్రధాని మోడీ బయలుదేరారు.



Post A Comment: