మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ల అంతా తమ కుటుంబ సభ్యులేనని వారందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మార్కండేయ కాలనీ లక్ష్మి పంక్షన్ హల్లో రామగుండం కార్పోరేషన్ ఏరియా ఆటో యూనియన్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు...
రామగుండం నియోజకవర్గానికి తాము ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుండి ఆటోవాలాలకు ఆటో డ్రైవర్లకు పోలీసు వారి నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నానని అన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్ అందరికీ డ్రెస్ కోడ్ ఇస్తామని వారికి తామే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ఆటో అన్నలందరూ చర్చ పెట్టాలని రామగుండంలో మెడికల్ కళాశాల తీసుకువచ్చింది... సబ్ రిజిస్టర్ కార్యాలయం... సబ్ సివిల్ కోర్టు తీసుకువచ్చింది ఎవరో తమ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రజలకు వివరించాలన్నారు.నా ప్రచార సాధకులుగా నా ఆటో డ్రేవర్లు చర్చ చేయాలన్నారు. రామగుండానికి రాదన్న మెడికల్ కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెప్పించి ఒప్పించి ఈ ప్రాంతంలో ప్రారంభింప చేశామని చెప్పారు. మెడికల్ కళాశాలలో ఈ సంవత్సరం 150 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని ఈ సంవత్సరం లాగానే ఐదు సంవత్సరాలలో 750 మంది విద్యార్థులు మెడికల్ కళాశాలలో ఉన్నారని చెప్పారు. షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం గోప్పనా లేక మెడికల్ కళాశాల తీసుకురావడం సబ్ రిజిస్టర్ కార్యాలయం తీసుకురావడం సబ్ సివిల్ కోర్టు తీసుకురావడం గోప్పనా ప్రజలు ఆలోచన చేయాలన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక కాంగ్రెస్ బిజేపి నాయకులు దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నరని రాబోవు రోజుల్లో ప్రజలే వారికి తగిన బుద్ది చెబుతారనీ అన్నారు. రామగుండం నియోజకవర్గం లో దాదాపు 50 వేల మంది తెలంగాణ ప్రభుత్వ పధకాల పోందిన వారు ఉన్నరని సిఎం కేసీఆర్ పాలన పట్ల వారు పూర్తి విశ్వాసంతో ఉన్నరని రామగుండంలో బి.ఆర్.ఎస్ బారి మెాజర్టీతో విజయం సాధించడం సిఎం కేసీఆర్ హ్యట్రిక్ సిఎం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమం లో స్దానిక మార్కండేయ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం లో నాయకులు తానిపర్తి గోపాల్ రావు సీనియర్ గోపు అయులయ్య యాదవ్ పాత్రికేయులు దయానంద్ గాంధీ గౌస్ పాషా గంగ శ్రీనివాస్ హఫీజ్ రామగుండం కార్పోరేషన్ ఏరియా ఆటో యూనియన్ నాయకులు ఈర్ల అయులయ్య నీలరపు రవి మాటేటి రాజేశం రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: