ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 12,22,23 డివిజన్లలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ కావటి కవిత రాజుయాదవ్,22వ డివిజన్ ఇంచార్జ్ మావూరపు గీతా విజయ్ భాస్కర్ రెడ్డి, 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్, ఇంచార్జ్ యేలుగం లీలావతి సత్యనారాయణ డివిజన్ ఆత్మీయ సమ్మేళనంలో నేడు దేశాయిపేటలోని సికేఎం కాలేజ్ గ్రౌండ్ వేదికగా జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎంపీ పసునూరి దయాకర్,మాజీ ప్రభుత్వ విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ
కేసీఆర్ ఆశీర్వాదం వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో ముందుంచాము.
కేసీఆర్ చావునొట్లొకి వెళ్లి తెలంగాణ సాధించారు సాధించిన తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు.
1100కోట్లతో హాస్పిటల్,240 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కలెక్టరేట్, మోడ్రన్ కూరగాయల మార్కెట్,పండ్ల మార్కెట్, అద్భుతమైన సిసి రోడ్లు, కార్మిక భవనాలు,75కోట్లతో బస్ స్టేషన్,విద్యలో బాగంగా 7 గురుకుల పాఠశాలలతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
ఒక సామాన్యుడైన నన్ను ఎమ్మెల్యే చేసిన ఘనత కేసీఆర్ ది.
కేసీఆర్ అవకాశం కల్పించి కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యే గా చేస్తే ప్రజల కోసమే పని చేస్తున్నాం.
గజం జాగా ముట్టుకోలేదు ఒక్కరినీ ఒక్క రూపాయి అడగలేదు నిఖార్సుగా ప్రజలకోసం పాటుపడుతున్నాం.
ఒక పేదింటి బిడ్డ ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం ఏ విదంగా అభివృద్ధి జరిగింది అనేది మీ కళ్ళముందు ఉంది.
బోడకుంట్ల వెంకటేశ్వర్లు గతంలో సైతం నాకు అన్ని విధాలా అండగా ఉన్నారు.
బిఆర్ఎస్ పార్టీ రెండు సార్లు నగర అధ్యక్షునిగా,మేయర్, ఎమ్మెల్యే పని చేసే అవకాశం నాకు దొరికింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన సంక్షేమ పధకాలు కాన్పు నుండి కాటి వరకు అన్ని రకాలుగా అందిస్తున్నారు.
కేసీఆర్ కిట్,ఆసరా,రైతు బంధు రైతు బీమా ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల పధకాలు ప్రజలకు అందిస్తున్న మనసుగల్ల ముఖ్యమంత్రి కేసీఆర్.
మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యేవరకు తూర్పు నియోజకవర్గం మొక్కవోని దీక్షతో పని చేస్తోంది.
గతంలో 28వేల మెజార్టీ ఇచ్చారు ఈ సారి తూర్పు నుండి 50 వేల మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి కి కానుక ఇస్తాం.
నియోజకవర్గంలో అభివృద్ధి,సామాన్యుల ఎదుగుదల కోసం అహర్నిశలు యజ్ఞమే చేస్తున్నాం.
ఇంటింటికి కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లో వివరించాలి.
జూన్ 2 నుండి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల ప్రణాళిక సిద్ధమైంది
మున్సిపల్ మంత్రి కేటీఆర్ ని ఎప్పుడు నిధులు అడిగిన కాదనకుండా ఇస్తున్నారు.
కేటీఆర్ అహర్నిశలు శ్రమిస్తూ విదేశాల్లో పర్యటిస్తు మన రాష్ట్రానికి పెట్టుబడులు,కంపెనీలు తీసుకొస్తున్నారు.
కేసీఆర్,కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా మంత్రి ఎర్రబెల్లి సహకారంతో 3800కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం.
కరోనా కష్టకాలంలో కొందరు నాయకులు ఫామ్ హౌస్ లో పడుకుంటే మరి కొందరు కోళ్ల ఫారాల్లో ఉన్నారు.
కరోనా సమయంలో తాను ఎమ్మెల్యేగా అహర్నిశలు శ్రమించి వైద్యం ఏర్పాటు చేసి 25వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసాం.
-ప్రజలు బతుకులు బాగుపడాలి అనేదే నా దృఢ సంకల్పం.
ఇప్పుడు కనిపించే కొందరు నాయకులు ఈ ప్రాంతంపై అవగాహన లేని వారు,ఈ ప్రాంత బిడ్డలు కారు వాళ్లకు ఎమ్మెల్యే కావాలి, అందలమెక్కాలి సంపాదించుకోవాలి అనే తపన తప్ప ప్రజలకు మంచి చేయాలని ఏనాడు లేదు.
కేసీఆర్ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలది .
మరొక్కసారి కేసీఆర్ ని బలపరిచి తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ...
నరేందర్ ఒక నిరుపేద కుటుంబం నుండి ఎదిగారు.
నిరంతరం ప్రజల్లో ఉంటున్న నాయకుడు నన్నపునేని నరేందర్.
కేసీఆర్ ఆశీర్వాదం నరేందర్ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నారు
కేసీఆర్,నరేందర్ ని కాపాడుకోవాలి
కేసీఆర్ నాయకత్వాన కోట్లాది తెలంగాణ తెచ్చుకున్నాం.
తెలంగాణ రాకముందు కరెంట్ కష్టాలు,నల్లాల దగ్గర బిందెలతో పంచాయతీ ఉండేది రాష్ట్రం ఏర్పడిన తరువాత అవేవి లేవు అభివృద్ధిలో నంబర్ వన్ గా నిలిచాము.
అభివృద్ధి సంక్షేమంతో అన్ని రకాలగా ముందున్నాం కాబట్టి ప్రజలకు వివరించి మనం కేసీఆర్ కి తోడుగా ఉండాలి.
వందల కొద్దీ సంక్షేమ పథకాలు కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అందుతున్నాయి.
పనిచేసే ముఖ్యమంత్రి ని కాపాడుకోవాలి.
సామాన్యులను కేసీఆర్ అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది అనేది నరేందర్ ఓరుగల్లు తూర్పును గొప్పగా అభివృద్ధి చేసి చూపించారు.
కేసీఆర్ నాయకత్వంలో మన తెలంగాణను గొప్పగా అభివృద్ధి చెందుతుంది
భారత దేశంలో తెలంగాణ నంబర్ వన్.
ఇతర రాష్ట్రాల్లో మన ప్రగతి గురించి చర్చ జరుగుతుంది.
మహారాష్ట్రలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన పధకాలు కావాలని మాకు కేసీఆర్ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు.
కార్యకర్తలను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తూ కాపాడుకునే ఏకైక పార్టీ బిఆర్ఎస్ లో మాత్రమే
మనమందరం ఒక ఇంటి బిడ్డలం.
నరేందర్ని మరొక్కసారి దివించాలని కోరుకుంటున్న.
మాజీ ప్రభుత్వ విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
నరేందర్ మీకు తోడుగా ఉంటున్నాడు ఆశీర్వదించండి.
ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండే నాయకుడు నరేందర్
నరేందర్ 24 గంటలు ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
కేసీఆర్,కేటీఆర్ నాయకత్వాన బ్రహ్మాండమైన అభివృద్ధి.
ముఖ్యమంత్రి కేసీఆర్ మీతో ఆత్మీయంగా మాట్లాడుతూ కలిసి భోజనం చేయమని ఈ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నాం.
ఈ సారి 105 సీట్లు గెలిచి మన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం
రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం.
కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ కిట్,24గంటల కరెంట్,24అంతస్థుల హాస్పిటల్ వరంగల్ లో నూతన కలెక్టరేట్ కట్టుకోబోతున్నాం.
వరంగల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది చరిత్ర కలిగిన పట్టణం మన ఓరుగల్లు
కాకతీయ రాజులు చేసిన గొలుసుకట్టు చెరువుల వల్ల,నేడు మనం చేపట్టిన మిషన్ కాకతీయ వల్ల నీళ్లు ఉబికు వస్తున్నాయి.
ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
ఏ వర్గమైన అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.
భారతదేశంలో చాలా మంది మన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనుకరిస్తున్నారు.
మోడీ మన పథకాలను ఫాలో అవుతున్నారు.
24 గంటలు కరెంటు ఇస్తున్నారు,కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కట్టారు,గతంలో ప్రాజెక్ట్ కట్టాలి అంటే 30 ఏండ్లు పట్టేది.
కేసీఆర్,కేటీఆర్
వల్ల రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి.
నియోజకవర్గంలో రింగ్ రోడ్లు నిర్మిస్తున్నాము.దేశాయిపేటలో ప్రజలను నన్ను కూడా ఆశీర్వదించడం జరిగింది.
పడవులచ్చిన మాకు గర్వము లేదు మేము నిరుపేదల నుండి వచ్చిన వాళ్ళమే.
కేసీఆర్ నాయకత్వంలో నరేందర్ అభివృద్ధి చేసుకుంటు ముందుకు సాగుతున్నారు.
కేసీఆర్ నాయకత్వనా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది.
తెలంగాణ 56లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారు.
గతాపాలకులు మనల్ని కించపరిచారు. మనకు పాలన చేతకాదని పలు రకాలుగా విమర్శించారు వారందరిని దాటుకుని అద్భుత పాలన అందిస్తున్నారు.
బీజేపీ బోగస్ ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎం పని చేసారు అనేది చెప్పాలి.
కేసీఆర్ ని ఉద్దేశపూర్వకంగా విమర్శించడం తప్ప మరేమీ చేతకాదు
బీజేపీ ప్రభుత్వం మన అభివృద్ధికి సహకరించడంలేదు.
కర్ణాటకలో మొన్ననే చిత్తు చిత్తుగా ఓడించారు.
దేశ వ్యాప్తంగా కేసీఆర్ పేరు మారుమోగుతుంది.
సోషల్ మీడియా వేదికగా కుతంత్రాలు చేసే వారిని తిప్పికొట్టాలి.
ఈ కార్యక్రమంలో చెర్మన్లు,కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,ఇంచార్జ్ లు,రాజకీయ ప్రముఖులు, పిఏసిఎస్ చెర్మన్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: