మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

           

మానవాళి జ్ఞానజ్యోతి గౌతమ బుద్ధుడు అని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ అన్నారు శుక్రవారం రామగుండం ప్రెస్ క్లబ్ లో సమతా సైనిక దళ్ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని  జయంతిని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా వారు గౌతమ బుద్ధుని చిత్రపటానికి  పూలు సమర్పించి బుద్ధ బంధనం చేశారు 

అనంతరం వారు మాట్లాడుతూ గౌతమ్ బుద్ధుడు చిన్నతనంలోనే సకల సుఖాలు భార్యపుత్రులను వదిలి రాజ్యం ధనమును వదిలి తీవ్రమైన తపస్సు చేసి హిందూ సమాజం ఎదుర్కొంటున్న అంధవిశ్వాసాలను ప్రారదోలి కుల వ్యవస్థను ధర్మ వ్యాప్తి గావించి ప్రజ్ఞ సమత కారణాలను వ్యాప్తి చేసిన జ్ఞాన జ్యోతి అని తెలిపారు. దుఃఖానికి కారణం కోరికలే అని అసమానతలు లేకుండా మానవత్వం తోటి జీవించాలని బోధించాడని తెలిపారు బుద్ధుడు చారిత్రక పురుషుడు  ఆయన సందేశం తో అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించి తమ యొక్క పరిపాలన సుభిక్షంగా సాగించి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. ఏ వేదాంతలు మునులు, గురువులు బుద్ధుని సందేహాలను నివృత్తి చేయలేకపోయారన్నారు  మానవ జాతి చరిత్రలో వర్ణ వర్గ జాతి వివక్షత లేకుండా  సర్వ మానవ కళ్యాణం కోసం పరితపించి అహర్నిశలు కృషి చేసిన మహా వ్యక్తి గౌతమ బుద్ధుడు అని అన్నారు. 

గౌతమ బుద్ధుడు పంచశీల సూత్రాలను ప్రబోధించాడు. అవి అసత్య మాడరాదు , దొంగతనం చేయరాదు , వ్యభిచారం చేయరాదు , మత్తు పదార్థాలు సేవించరాదు ,జీవహింస చేయరాదు అని బోధించారని తెలిపారు.

అష్టాంగ మార్గాన్ని బుద్ధుడు ప్రబోధించాడు సమానమైన దృష్టి సమానమైన సంకల్పం సమానమైన వాక్కు సమానమైన కర్మ సమానమైన అజీవిక సమానమైన న్యాయం సమానమైన స్మృతి సమానమైన ఈ అష్ట మార్గం పంచశీల సూత్రాలు ద్వారా బుద్ధుడు సమాజానికి బోధించాడని తెలిపారు. ధర్మాన్ని బోధించే పనిలో కార్మికుని వల్లే బుద్ధుడు శ్రమించాడని మనుషుల ప్రశాంతత జీవనానికి సమసమాజ నిర్మాణానికి బుద్ధుడు బోధనలు తిరుగులేని సాధనాలన్నారు.

బుద్ధుని బోధనలు శీలం ప్రజ్ఞ కరుణ. త్రీ   రత్నాల వంటివి  అందరూ బౌద్ధ ధర్మం లో సమానులే బుద్ధుడు ధర్మం సంఘం ఫ్రీ శరణాలు బుద్ధుడు విశ్వ జ్యోతి విశ్వ జ్ఞాని అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సమత సైనిక దళ్ నాయకులు దుర్గం విశ్వనాథ్ బండారి శివశంకర్ చీదురు వసంతరావు దూట రాజు, దుర్గం తిరుపతి రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జమీల్ ,లక్ష్మణ్ ఉపాధ్యక్షులు అంజయ్య ప్రచార కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: