మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితరత్న అవార్డు ఎన్టిపిసి ఉద్యోగి మరియు మా యూనియన్ కార్యదర్శి అయినా కామ్రేడ్ రాసపల్లి సంపత్ కు రావడం ఆనందదాయకం. సిఐటియు అనుబంధ ఎన్టిపిసి యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గము, కామ్రేడ్ E భూమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయనను శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ ఎన్ బిక్షపతి ప్రసంగిస్తూ దళిత వర్గాలకు కామ్రేడ్ సంపత్ చేసిన సేవలకు గుర్తింపుగా దళితరత్న పొందడం అభినందనీయమని కొనియాడారు. దళిత రత్నం అవార్డు రావడంతో సంపత్ పై దళిత, బడుగు బలహీన వర్గాలకు మరింత సేవలు చేసే బాధ్యత పెరిగిందని, ఇంకా ఉత్సాహంతో పనిచేయాలని కోరడం జరిగింది. కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు అందరూ ఆయనను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాక అధ్యక్షులు ఈ భూమయ్య, ప్రధాన కార్యదర్శి బి సారయ్య, నాయకులు ఆర్ సాంబయ్య, పి స్వామి, రాచపల్లి కుమార్, సిహెచ్ శంకర్, ఐ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: