మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారి పేట గ్రామానికి చెందిన సమతా సైనిక దళ్ నాయకులు సమతా ఫౌండేషన్ సభ్యులు దళిత రత్న అవార్డు గ్రహీత బండారి శివశంకర్ ను ఫౌండేషన్ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా వారు భగవాన్ బుద్ధ డాక్టర్ అంబేద్కర్ ల చిత్రపటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా సమతా సైనిక దళ్ నాయకుడు, సమత ఫౌండేషన్ సభ్యుడు బండారి శివశంకర్ ని ఎంపిక చేయడం గర్వకారణం అన్నారు. బండారు శివశంకర్ సమతా ఫౌండేషన్ ద్వారా కరోనా కష్టకాలంలో ఎంతోమంది నిరుపేదలకు నిత్యవసరాలు అందజేయడం అంబేద్కర్ పూలే భావజాలాన్ని ప్రజల్లో చేరవేయడం మొదలైన కార్యక్రమాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం దళిత రత్న అవార్డును అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో శివ శంకర్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో పదికాలాలపాటు చల్లగా వర్ధిల్లుతూ ఎల్లప్పుడూ ప్రజా సేవలు కొనసాగాలని ఇలాంటి అవార్డులు మరెన్నో పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక దళ్ సమతా ఫౌండేషన్ సభ్యులు దుర్గం విశ్వనాధ్ దూట రాజు చీదురు వసంతరావు దుర్గం తిరుపతి , ప్రెస్ క్లబ్ సభ్యులు జమీల్, లక్ష్మణ్ ,అంజయ్య దారా మధు, తదితరులు పాల్గొన్నారు

Post A Comment: