మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



"సింగరేణి కార్మికుల ఆశీర్వాద యాత్రలో" భాగంగా ఈరోజు ఉదయం ఆర్ జీ 2 ఏరియా పరిధిలోని 

ఓసీపీ3 లోని శావల్ & డ్రిల్ సెక్షన్ కార్మికులను, వకీల్ పల్లి గని మొదటి షిఫ్ట్, నైట్ షిఫ్ట్ కార్మికులను అప్యాయంగా పలకరిస్తూ, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న 

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 

ఈ సందర్భంగా ఎస్ ఎన్ డి క్యాంటీన్ లో & వకీల్ పల్లి గనిలో కార్మికులను ఉద్దేశించి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ,,

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పనిగట్టుకొని సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి శతవిదాల ప్రయత్నం చేస్తున్నారని, కార్మికులు సంఘటితమై 

వారి దుశ్చర్యలను తిప్పికొట్టాలని,

కార్మికుల సొంతింటి కలను నెరవేర్చడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలమయిందని,

సింగరేణి చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు సింగరేణి డబ్బులను ఇతర ప్రభుత్వ కార్యక్రమ అవసరాలకు వినియోగించుకోలేదు కానీ స్వరాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి డబ్బులను వాడుకొని సింగరేణి కార్మికుల పొట్టను కొడుతున్నారని దుయ్యబట్టారు.అదేవిధంగా ఇక్కడి సింగరేణి డీ.ఎం.ఎఫ్.టీ నిధులను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కు తరలిస్తుంటే, ఇక్కడున్న శాసనసభ్యుడు చోద్యం చూస్తూన్నాడే తప్ప, 

ఏ రోజు కూడా వాటిపై నోరుమెదపకుండా అసమర్థ పాలన కొనసాగిస్తున్నాడని, ఇక్కడి కార్మికుల క్షేమాన్ని మరచిన తెరాసా, బాజపా పార్టీలను రానున్న ఎన్నికల్లో బొందపెట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు..

అదేవిధంగా ప్రస్తుతమున్న ఎండల తీవ్రత వల్ల కార్మికులు తీవ్ర అస్వస్థతలకు గురయ్యే అవకాశం ఉన్నందున సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికుల పని వేళల్లో మార్పులు చేయాలని  యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు..

గడిచిన 25సంవత్సారాలుగా ఆపద వుందని తన వద్దకు వచ్చిన వారికి శక్తి మేర సహాయసహకారాలు అందిస్తున్నానని, రానున్న రోజుల్లో మీ ఇంటి బిడ్డగా ఒక అవకాశం ఇవ్వాలని, అధికారికంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కార్మికులను కోరారు..

వారితో పాటుగా సీనియర్ నాయకులు

కాల్వ లింగస్వామీ, మారెళ్లి రాజిరెడ్డి, కార్పొరేటర్లు మహంకాళీ స్వామి, ఎండీ.ముస్తఫా, సంపత్ రెడ్డి, కొక్కిరాల శ్రీనివాస్, వీరబోయిన రవి యాదవ్, బొంతల లచ్చన్న,

నాయిని ఓదెలు, తాల్లపెల్లి యుగెందర్, తిరుపతి రెడ్డి, మార్క రాజు, ధూళికట్ట సతీష్, 

ఊదరి నరేష్, చెన్న శ్రీను, గౌస్ బాబా, అనుమ రాములు, అనుమ సత్యనారాయణ, శివ, ప్రవీణ్, వసంత్, సోహెల్, అశ్రఫ్ & తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: