మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రైతులను రాజులుగా మార్చుతున్న ఘనత సిఎం కేసీఆర్ గారిది...తెలంగాణ రాష్ట్రం లో నడుస్తుంది రైతు రాజ్యం... ప్రతి ఎకరాకు సాగునీరు... రైతు కళ్లల్లో అనందమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని... రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎద్దేవా చేశారు. శనివారం పాలకుర్తి మండల పరిధిలోని కుక్కల గూడూరు గ్రామంలో బండల వాగు మరమ్మత్తు పనులు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి బండల వాగుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని మళ్లింపు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే చందర్ ముఖ్యఅతిథి హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో రైతులు తీరని అన్యాయానికి గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏర్పాటు చేయగా.. రామగుండం నియోజకవర్గానికి చుక్కనీరు కూడా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడంలో దాగి ఉన్న వారి చిత్త శుద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఏర్పాటుచేసి, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. 80 కోట్లతో రామగుండం నియోజకవర్గం లోని 20 వేల ఎకరాలకు సాగునీరు అందించెందుకు కృషి చేస్తున్నమన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. తొమ్మిదేళ్ల కాలంలోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేసి.. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపారన్నారు. గతంలో బండల వాగు చెరువులో చుక్కనీరులేక ఉండేదని, ప్రస్తుతం కేసీఆర్ చొరవతో జలకళ సంతరించుకుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులను మంజూరు చేసి, సహకరిస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన ఎమ్మెల్యే చందర్ కృతజ్ఞతలు తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా ఎమ్మెల్యే అభివర్ణించారు. గొప్ప ఆలోచనలతో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ దూసుకెళ్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టారని అన్నారు. ఇంతటి గొప్ప పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి ఆయన రుణం తీర్చుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు. జూన్ 2 నుంచి నిర్వహించతలపెట్టిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బండల వాగు చెరువుపై ఉత్సవ కార్యక్రమంలో నిర్వహించుకోవాలని అన్నారు.
వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ఎర్రం స్వామి, సర్పంచులు కోండ్రా చంద్రు, కోల లత, సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య, ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్, జయ్యారం ఎంపీటీసీ గంగాధర రమేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మల్లె తుల శ్రీనివాస్, బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు ఇంజపురి నవీన్, నాయకులు రావుల సాగర్, కాసర్ల కిరణ్, నారాయణ దాసు మారుతి, పర్లపల్లి రవి, తోడేటి శంకర్ గౌడ్, దొమ్మేటి వాసు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: