మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండలంలోని కాళేశ్వరం గ్రామం లో,శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర మున్నూరు కాపు సత్రం వాల్ పోస్టర్ ని నేటి శనివారం రోజు ఆవిష్కరించిన మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ పటేల్. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర మున్నూరు కాపు సత్రం భూమి పూజ ప్రారంభ కార్యక్రమం ఈ నెల 14 వ, తేదీ ఉదయం 11:15 నిమిషాలకు ఉంటుందని, ఈ కార్యక్రమనికి రాష్ట్ర నాయకులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ సభ్యులు, జిల్లా, మండలాల నాయకులు హాజరు అవుతున్నారని, కావున తెలంగాణ, ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ కుల బంధావులు అంత అధిక సంఖ్యలో విచ్చేసి భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సత్రం ట్రస్ట్ సభ్యులు, కాళేశ్వరం మున్నూరు కాపు కుల పెద్దలు, యువత పాల్గొన్నారు.

Post A Comment: