పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:మే:6:రామగుండం నియోజకవర్గంలో మే 8 దీ,సోమవారం నిర్వహించే రామగుండం నవ నిర్మాణ తెలంగాణ అభివృద్ధి మంత్రి కేటీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలనీ రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపు నిచ్చారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడురు,రామగుండం నియోజకవర్గంలో ప్రతి గడపకు సంక్షేమ పథకం అందుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి దిక్సూచిగా రామగుండం నియోజకవర్గం నిలుస్తుందని తెలిపారు.తెలంగాణ ఉద్యమ సమయంలో రామగుండం నియోజకవర్గంలో వెలుగులు రావాలని కేటిఆర్ 10 కీలో మీటర్లు పాదయాత్ర చేశారన్నారు.తెలంగాణ ఎర్పాటు జరిగాక పేద ప్రజల కల్లళ్ళో అనందం నిండిందన్నారు.రామగుండం నియోజకవర్గం ప్రజల ఉచిత వైద్యం అందించేందుకు మెడికల్ కళాశాల ఎర్పాటు చేయించామన్నారు.యువతకు ఉపాధి కల్పనకై ఇండస్ట్రీయల్ పార్క్ విజయవంతం చేయాలనీ పార్కును మాంజూరు చేయుంచామన్నారు.ప్రజలు కోరుకున్న విధంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు,సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పారిశ్రామిక ప్రాంతానికి మాంజూరు చేయుంచమన్నారు.రామగుండం నియోజకవర్గంలో ఇండస్ట్రీయల్ పార్కు శంకుస్థాపన,పోలీస్ కమీషనర్ నూతన భవనం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఫైలాన్ అవిష్కరణతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం,గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు రామగుండం నవనిర్మాణ భారీ భహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రామగుండం నియోజకవర్గం సాధించిన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ రామగుండం నవ నిర్మాణ భహిరంగ సభకు హాజరై కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలపాలన్నారు.అలాగే కార్మికులు,కర్షకులు,వ్యాపారస్తులు,మేధావులు,ఉద్యమకారులు,పార్టీ అభిమానులు,అన్నివర్గాల ప్రజలు హాజరై రామగుండం నవనిర్మాణ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ విలేఖరుల సమావేశంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్,డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మూల విజయారెడ్డి,జడ్పీటీసి అముల నారాయణ,నాయకులు పి.టి.స్వామి తోడేటి శంకర్ గౌడ్,దీటి బాలరాజు,నడిపెల్లి మురళిధర్ రావు,మాదాసు రామముర్తి,పర్లపల్లి రవి,జే.వి రాజు,నారాయణదాసు,మారుతి,ఇంజపురి నవీన్ తిరుపతి నాయక్ కార్పోరేటర్ పాముకుంట్ల భాస్కర్,కో ఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి,వంగ శ్రీనివాస్,ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్,జహిద్ పాషా,తానిపర్తి గోపాల్ రావు,అచ్చే వేణు,మెతుకు దేవరాజ్,నూతి తిరుపతి,చిప్ప రాజేశం, బొడ్డుపల్లి శ్రీనివాస్,మండ రమేష్,చల్ల రవీందర్ రెడ్డి,ఇనుముల సత్యం,అడప శ్రీనివాస్,గుంపుల ఓదెల యాదవ్,బెంధే నాగభూషణం,నీరటి శ్రీనివాస్,పీచర శ్రీనివాస్,అదర్ సండే సమ్మరావు,మద్దెల శ్రీనివాస్,హమీద్,దాసరి ఎల్లయ్య,సిరాజోద్దిన్ మెహిద్,సన్నీ
నూకరాజు,కోల సంతోష్,శ్రీనివాస్ రెడ్డి,మెరుగు చంద్రమౌళి,బెంద్రం రాజిరెడ్డి,మీర్ ఫయాజ్ అలీ,దేవి లక్ష్మినర్సయ్య, మహంకాళి అంజయ్య,వీరాలాల్,తాజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: