మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మంచిర్యాల జిల్లా: తాండూర్ మండలంలోని శనివారం సంత పక్కన గల అండర్ బ్రిడ్జి వద్ద వాహనాలు నిలుప రాదని, నిలిపితే జరిమానా విధిస్తామని తాండూర్ ఎస్ఐ రాజశేఖర్ ఓక ప్రకటన లో తెలిపారు.సంతకు వచ్చే ఆటో ట్రాలీ, జీబులు భారీ వాహనాలు ఎక్కడ బడితే అక్కడ నిలుప కూడదని, అక్కడ గోడలపై పెయింటింగ్ తో రాయించారు. పోలీసులు, గ్రామ పంచాయితీ అధికారులు సూచించిన
చోట పార్కింగ్ చేసుకోవాలని కోరారు.గత వారం కొన్ని ఆటో ట్రాలీ, జీబులు అండర్ బ్రిడ్జి మూల మలుపు వద్ద నిలుపడంతో ట్రాఫిక్ జామ్ అయిందని, నేడు పార్కింగ్ చేసిన వారికి జరిమానా విధించి అవగాహన కల్పించామని తెలిపారు.
వీరి వెంట అడిషనల్ ఎస్ఐ మదుసుధన్, ఎఎస్సై కాటారపు శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుళ్లు మనోహర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: