మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
నూతనంగా ప్రారంభించబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలిసారు.. నియోజకవర్గ పరిధిలోని అంతర్గాం మండలంలో ఈనెల 8న ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అనుమతి నివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్యే చందర్ కోరారు.
కాగా ఐటీ పార్కు ఏర్పాటుపై ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే చందర్ తెలిపారు. ఎమ్మెల్యే వెంట టిబిజికెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య తదితరులున్నారు..

Post A Comment: