మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రెస్ భవన్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ అకాల వర్షంతో ఆగమవుతున్న అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందేనని హెచ్చరించారు ఇటీవల కురిసిన అకాల వర్షంతో మన జిల్లాలోని ప్రతి గ్రామంలో మరీ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలోని జనగాం లింగాపూర్ కుందన్ పల్లి పెద్దంపేట్ రాయదండి అంతర్గాం గోలివాడ బ్రాహ్మణపల్లి ఆకనపల్లి సోమనపల్లి ఎగ్లాస్పూర్ పొట్యాల మద్దిరాల పాలకుర్తి మండలంలోని కుక్కల గూడూర్ పుట్నూర్ జయ్యారం గుడిపల్లి రామారావు పల్లె తక్కల్లపల్లి పాలకుర్తి కొత్తపల్లి ప్రతి గ్రామంలో అకాల వర్షంతో వరి కోయని పంటలన్నీ వరదలో మునిగి నష్టపోగా వరి కోసిన ధాన్యం సరైనటువంటి కల్లాలు లేక ఎక్కడ పడితే అక్కడ ఆరబోయడంతో సరైనటువంటి వసతులు లేకపోవడం తేమ శాతం పేరుతోటి మరియు లారీలు అందుబాటులో లేవని సరైన సిబ్బంది లేదని రకరకాల కారణాలు చెప్పుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు విషయంలో ఆలస్యం చేయడం వలన రైతులు కల్లాలోనే ధాన్యాన్ని ఉంచడంతో అకాల వర్షంతో పూర్తిగా తడిసి ముద్దయి మొలకెత్తి ఉండడంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తారో చేయరో అని రైతులు బిక్కుబిక్కుమంటూ ఆవేదనకు గురవుతూ తీవ్రంగా నష్టం జరిగిన కొంతమంది చిన్న కారు రైతులు ఆత్మహత్యలకు దారి తీసే ప్రమాదం పొంచి ఉన్నందున వెంటనే బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా కోతలు లేకుండా ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అదేవిధంగా ఇంకా కోయని పంటలను పరిశీలన చేసి నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని మీడియ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు*ఈ పాత్రికేయుల సమావేశంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తక్కల్లపల్లి సర్పంచ్ ముక్కెర శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలారి శంకర్ సత్తయ్య రాజకుమార్ వాసుదేవరావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: