మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

  

నేడు రైతులు ఆరుగాలం కష్టపడి ఎండ అనక వాన అనక కాయ కష్టం చేసి అప్పులు చేసి పెట్టు బడులు పెట్టి సాగు చేసిన వరి ధాన్యం అమ్ముకునేందుకు ఐకేపీ సెంటర్స్ లో ఆరబోస్తే నేడు అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దయి మొలకలస్తుంటే ఈ రోజు రైతుల కంట్లోంచి నీరు కాదు రక్తం బయటకు వస్తుందన్నారు.  

అంతగ్రామ్ మండలం లోని ఆకేనపెల్లి,సోమన్ పెల్లి, బ్రాహ్మణ పెల్లి, పొట్యాల, ఎగ్లాస్ పూర్ తదితర గ్రామాల రైతులను కలిసి వారికి భరోసా కల్పిస్తూ మీకు అండగా నేనున్నా దాన్యం కొనేధాక విశ్రమించేది లేదని రైతుల కోసం అలుపెరగని పోరాటం చేస్తానని, వారికీ భరోసా కల్పిస్తూ 

రైతు తడిసిన వరి ధాన్యం మొలకలస్తే తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతుంటే ఇవ్వాళ అగ్రికల్చర్ అధికారులు ఈ విపత్తుకు సంబంధించి ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా

తేమ రాలేదానో ఇంకోటి రాలేదనో జాప్యం చేయకుండ అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎటువంటి తరుగు లేకుండా రైతులు కలతచెంది ఏదైనా నిర్ణయం తీసుకుని అగాయిత్యానికి పాల్పడక ముందే తక్షణమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనీ జాయింట్ కలెక్టర్ ను కోరడం జరిగినది. లేనిచో రైతుల ధాన్యాన్ని కలెక్టర్ కార్యాలయానికి తీసుకువచ్చి నిరసన చేపడతామని మానవత్వంతో అలోచించి రైతుల తడిసిన దాన్యాన్ని త్వరిత గతిన కొనుగోలు చేయాలనీ కోరారు.

  ఈ కార్యక్రమం లో డీసీసీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ వెంట మాజి ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ,మండల అధ్యక్షులు హనుమాన్ రెడ్డి,అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి,కోర్డినేటర్ గాదే సుధాకర్,గుంట బాపు,మరి రాజకుమార్, మంతెన మహేందర్, గజ్జెల నాగరాజు,యూత్ కాంగ్రెస్ ఓల్లెపు సాయి, ఒళ్ళేపు స్వామి,ఐలవేణి నరేష్, ఆకుల రాము,ఉప్పులేటి సాయి,సోషల్ మీడియా వారియర్స్ పల్లికొండ రాజేష్, అశ్రఫ్ ఖాన్, అల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: