మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎస్సీ ఉపకులమైన నేతకాని కులస్తులకు కులం సర్టిఫికెట్ మీసేవ ద్వారా నేతకాని కాకుండా నేతాని/నెట్కాని గా వస్తుందని తద్వారా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నేతకాని గా కులం సర్టిఫికెట్ సవరించాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాసును కోరారు. ఈ మేరకు సోమవారం సమతా సైనిక దళ్ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ నివాసలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులు వారి తాతల తండ్రుల కాలం నుండి ఏజెన్సీ ప్రాంతంలో అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే చస్తూ జీవనం కొనసాగిస్తూ 1/70 యాక్ట్ వల్ల పుట్టిన భూమిపై హక్కులు లేక, రాజకీయ రిజర్వేషన్ లేక జీవో నెంబర్ 3 తో స్థానిక ఉద్యోగాల్లో అవకాశాలు లేక ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధికి నోచుకోని దళితులకు నూటికి నూరు శాతం దళిత బంధు అమలు చేయాలని కోరారు. అదేవిధంగా అన్ని కులాలకు సంక్షేమ భవనాలు నిర్మించినట్లు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంలో నేతకాని సంక్షేమ భవనం నిర్మించాలని కోరారు. చైర్మన్ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక దళ్ నాయకులు బండారి శివశంకర్ జాడి నరేందర్, ఐలయ్య తదితరులు ఉన్నారు

Post A Comment: