మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మేరీ లైఫ్ మేరా స్వచ్చ షహార్ ప్రచార కార్యక్రమంతో పాటు రాబోయే వర్షా కాలం దృష్టిలో పెట్టుకొని నుండి ఎనిమిది రోజుల పాటు నిర్వహించనున్న స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ విజయవంతం చేయాలని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ , మున్సిపల్ కమిషనర్ బి. సుమన్ రావు కోరారు. ఈ మేరకు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ పర్యావరణ హితంగా జీవన విధానం మల్చుకోవాలనే లక్ష్యంతో జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరకు మేరీ లైఫ్ - మేరా స్వచ్చ షహర్ ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రిపుల్ ఆర్ కేంద్రాలు అనగా రి డ్యూస్ , రీ యూజ్ , రీ సైకిల్ కేంద్రాలు వార్డుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు తమకు ఉపయోగ పడని పాత వస్తువులు , పాత పుస్తకాలు , పాద రక్షలు వంటి రీ సైకిలింగ్ కు ఉపయోగపడే వస్తువులను ఈ కేంద్రాలలో అప్పగించాలని సూచించారు. ఈ విషయం పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. అలాగే ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ జరగాలని సూచించారు , చెత్త మున్సిపల్ వాహనానికి ఇవ్వకుండా బయట పడవేసే వారికి జరిమానాలు విధించాలని సూచించారు. వార్డు ఆఫీసర్ ల నేతృత్వంలో ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు ఆర్ పి లు సహకరిస్తారని అన్నారు. వాలంటీర్ ల సేవలు కూడా ఉపయోగించుకుంటామని అన్నారు. స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ లో భాగంగా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించడంతో పాటు శిధిలాలు తొలగించడం , రోడ్ల ప్రక్కన తుప్పలు , పొదలు తొలగించడం , కాలువల్లో పూడిక తీత , శిధిలావస్థ లో ఉన్న భవనాల తొలగింపు ,మాంస వ్యర్థాల సక్రమ నిర్వహణ , ప్రజా మరుగు దొడ్ల మరమ్మత్తు తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాగా అంతకు ముందు మేయర్ ఛాంబర్ లో పారిశుద్ధ్య నిర్వ హణపై సిబ్బందితో మేయర్ కమిషనర్ సమీక్షించారు . చెత్త బయట పడ వేసే వారికి జరిమానా లు లు విధించాలని ఆదేశించారు.అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెత్త సేకరణ రుసుము ఇంటింటి నుండి రూ 40/- తప్పనిసరిగా వసూలు చేయాలని ఆదేశించారు. చెత్తను మున్సిపల్ వాహనానికి ఇవ్వని వారికి అవగాహన కల్పించాలని కోరారు . ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ నారాయణ రావు, ఆర్ ఓ రాయలిoగు , సూపెరిండెంట్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: