మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్మిక సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా ఓసిపి ఫైవ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోర్ కంటి చందర్ హాజరై, పతాకావిష్కరణ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. అన్న ఓ మహాకవి అన్నట్టుగా ఎన్నో ఉద్యమాలు చేసి కార్మిక హక్కులను రక్షించుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ.. కార్మిక హక్కులను తుంగలో తొక్కుతోందన్నారు.
ప్రైవేటు యాజమాన్యాలు కార్మికులకు సరైన పనికి సరైన వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. సంఘాలకు అతీతంగా, జెండాలకతీతంగా కార్మిక సంఘాలు ఏకమై కార్మిక హక్కుల రక్షణకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి, 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లకు కుదింపు చేసిందన్నారు. 8 గంటల పనిదినంను 12 గంటలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం కుట్రకు యోచిచేస్తుందన్నారు. కార్మికులు కష్టపడి సంపాదించుకున్న సంవత్సరం వేతనంలో, నాలుగు నెలల వేతనం ఆదాయపు పన్ను రూపేనా ప్రభుత్వం వసూలు చేస్తోందన్నారు. గత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్మికులకు చేసిందేమీ లేదని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికులందరూ కలిసి ఎండగట్టాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.
బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. మన చట్టాలను, మన హక్కులను మనమే రక్షించుకునే విధంగా కార్మిక వర్గం కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి సీఎం గొప్ప పాలనలో కార్మిక సమ్మెలు, ఆర్తనాదాలు లేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కార్మికులు సంతోషంగా ఉన్నారని అన్నారు. అడిగిన దానికన్నా వేతన సవరణ చేస్తూ, వారి సంక్షేమం కోసం వారసత్వపు హక్కును సాధించిన ఘనత సీఎం కు దక్కుతుంది అన్నారు.
కాగా స్థానిక ప్రజానీకం అభీష్టం మేరకే ఓసిపి-5 ప్రారంభమైందని, ఇది తెలియని కొంతమంది నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే తనపై అసత్యపు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. ఓసిపి-5తో కార్మిక లోకానికి న్యాయమే జరిగిందన్నారు. అవగాహన లేని నాయకులు ధ్వంధ్వ వైఖరిని అవలంబిస్తున్నారని, కార్మికులు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకునే సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో మనం ఉన్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, నాయకులు గండ్ర దామోదర్ రావు, మండ రమేష్, బిఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్ తో పాటు పలు కార్మిక యూనియన్ల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: