మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులు మంజూరు చేస్తానని మాట ఇచ్చిన కెటి రామన్నకు నియోజకవర్గ ప్రజలంతా రుణపడి ఉంటామని రామగుండం ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్ లో జరిగిన 'రామగుండం నవనిర్మాణ సభ' గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే రోడ్లు వేయడం, బ్రిడ్జీలు కట్టడమని గత పాలనలో ఉండేదన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం ఉండడమే నిజమైన అభివృద్ధి అన్నారు. ప్రతి కుటుంబం గౌరవంగా సుఖ సంతోషాలతో జీవించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. గోదావరి దిశను మార్చి, తెలంగాణ దశను మార్చిన అపర భగీరథుడు కేసీఆర్ అన్నారు . కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఇక్కడ సంవత్సరం పొడవూతా గోదావరిలో నీల్లున్నాయన్నారు. రామగుండం నియోజక వర్గంలోని ప్రతీ ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందుతోందన్నారు. పట్టణ ప్రగతి నిధులతో రామగుండం నియోజక వర్గానికి సకల మౌళిక వసతులను సమకూర్చుకోగలిగామన్నారు. రామగుండానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ ఆశీస్సులతో మెడికల్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరయ్యాయన్నారు. కేటీఆర్ గారంటే.. మెదడు నిండా విజ్ఞానం, హృదయం నిండా కరుణ అన్నారు. ఇండస్ట్రియల్, ఐటి పార్క్ ల శంకుస్థాపనకు జూలై, ఆగస్ట్ లో మళ్లీ ఒకసారి గోదావరిఖనికి రావాలని కేటీఆర్ ను కోరారు. ఇండస్ట్రియల్ ఐటీ పార్కుల శంకుస్థాపనకు తప్పకుండా జూలై ఆగస్టులో మళ్లీ వస్తానని ఐటీ శాఖ మంత్రికేటీ రామారావు తెలిపారు
ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్, భాను ప్రసాదరావు, ఎల్. రమణ, పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, దివాకర్ రావు, జడ్పి చైర్మన్లు పుట్ట మధుకర్, వర్షిణి, రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, జడ్పిటీసీ అముల నారాయణ, నాయకులు
దండే విఠల్, వెంకట్రావు, కెంగర్ల మల్లయ్యతోపాటు పలువురు కార్పోరేటర్లు, సర్పంచ్ లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

Post A Comment: