మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు ఐ.వి లెనిన్ జన్మదినాన్ని పురస్కరించుకొని 1969 సంవత్సరంలో ఏప్రిల్ 22వ తేదీన పీడిత ప్రజల ఆశా జ్యోతి సిపిఐ ఎంఎల్ పార్టీ ఏర్పడి నేటికి 54 సంవత్సరాలు అవుతుందని ఈ జన్మ దినోత్సవ సభ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 8వ కాలని లోని ఐ ఎఫ్ టీ యు ఆఫీసులో నిర్వంచడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బి అశోక్ మాట్లాడుతూ 1969 లో సిపిఐ ఎంఎల్ పార్టీ ఏర్పడి ఈ గోదావరి లోయ పరివాహ ప్రాంతంలో దున్నే వానికి భూమి కావాలని నినాదంతో లక్షలాది ఎకరాలపోడు భూములు నరికించి పేద ప్రజల బ్రతుకులలో వెలుగులను నింపిందనిఅన్నారు.
అనేకమంది అమరుల త్యాగాలతో సాధించుకున్న పోడు భూముల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కొని మొక్కలు నాటిందని విమర్శించారు.
ఇప్పటికైనా ఆదివాసులు ఇతర పేదల నుండి పోడు భూములను లాక్కునే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు
పోడు భూములకు పట్టాలిస్తామని సర్వేలు నిర్వహించి ఇప్పటివరకు ఏ ఒక్క ఎకరాకు పట్టా ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోడు పట్టా కొరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క దరఖాస్తుదారునికి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ,ఐ ఎఫ్ టీ యు నాయకులు డి బుచ్చమ్మ, వి రాజనర్సు, ఎం లింగయ్య, ప్రేంకుమార్, కె శారద, లత, కవిత, రమ, కళావతి. తదితరులు పాల్గొన్నారు
Post A Comment: