మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

నేడు రామగుండం లో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్   మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ను మిషన్ భగీరథ పంపు హౌస్ లలో పని చేసే ఆపరేటర్స్ వారి సమస్యల గురించి రాజ్ ఠాగూర్ కు వివరంచడం జరిగింది.


1.ఆపరేటర్స్ కి 8 నెలలు గడిచిన జీతాలు రావట్లేదని,

2. బేసిక్ పే లాంటిది ఇంతవరకు  మాకు కేటాయిoచలేదని.

3. మాకు ఈఎస్ఐ కార్డు ఫెసిలిటీ లేక నానా ఇబ్బందులు పడుతున్నాం.

4. మేము గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న  ఈ పి ఎఫ్ కూడా చెల్లించడం లేదు.

5. మాతో యాజమాన్యం వెట్టి చాకిరీ చేపిస్తుంది తప్పితే మాకు లీవ్ లాంటి సౌకర్యం కూడా లేదు.

6.మేము డ్యూటీ లో ఉండగా ప్రమాదవషత్తు ఎవరికైనా ప్రమాదం జరిగిన యాజమాన్యం స్పందిచట్లేదు.

7.మాకు ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భంలో హెల్త్ కార్డు పై ట్రీట్ మెంట్ జరిపించాలి.

8. చాలీ చాలని జీతాలతో బ్రతుకు వెళ్ళదీస్తున్న మాకు  గ్రూప్ 2కేటగిరి బేసిక్ పే ఇవ్వాలి. 9.మమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి వెంటనే పర్మినెంట్ చేయాలి.

10. మాకు కూడా హెచ్ఆర్ఏ, టిఏ డిఏ లాంటి సౌకర్యాలు కల్పించాలి.

11. తెలంగాణ ప్రజలకు త్రాగు నీటిని అందిస్తున్న మాకు గుర్తింపు ఇవ్వాలి. ఆపరేటర్స్ 

 పై సమస్యల గురించి రాజ్ ఠాగూర్ కు విన్నవించగా సానుకూలంగా స్పందించారు, కార్మికుల సమస్యలపై మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్  మాట్లాడుతూ...మిషన్ భగీరథ పంప్ హౌస్ లో వర్క్ చేసే కార్మికుల సమస్యలు న్యాయమైనవని కచ్చితంగా వారి సమస్యలను ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకువెళ్లి  అలాగే వారి యాజమాన్యంతో ఇట్టి సమస్యల గురించి  చర్చించి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు నా వంతుగా కృషి చేస్తానని అలాగే రాబోయే రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ లో  కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశాక మిషన్ భగీరథ పంప్ హౌస్ లలో పనిచేసే కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని, వారికి ఈఎస్ఐ ఫెసిలిటీస్ కల్పిస్తామని, వారికి ఈపీఎస్ సౌకర్యం కల్పిస్తామని, వారికి హెచ్ఆర్ఏ, టిఏ,డిఏ,ఫెసిలిటీ కల్పిస్తామని, ఎవరైనా డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తు గాయాలపాలు అయితే వారికి హెల్త్ కార్డు పై ట్రీట్మెంట్ చేపిస్తామని, అలాగే వారికి బేసిక్ పే విషయంలో మినిమమ్ వేతనం ఇస్తామని, తెలంగాణ ప్రజానీకానికి త్రాగునీరు అందిస్తున్న మిషన్ భగీరథ పంప్ హౌస్ ఆపరేటర్లు చేస్తున్న కృషిని కొనియాడుతూ వారికి తగిన విధంగా గుర్తింపుని ఇస్తామని ఈ సందర్భంగా మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్  వారి కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి వారికి హామీ ఇవ్వడం జరిగినది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: