మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్ / హైదరాబాద్: పరీక్ష పేపర్ లీకేజిల వల్ల నెలల పాటు, సంవత్సరం పాటు వ్యయ ప్రయాసల కు ఓర్చుకొని ఇష్టపడి చదివిన విద్యార్థులు వారి తల్లి తండ్రులు కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది.
అలాగే ప్రతిభ లేని వారు కూడ డబ్బు తో ప్రశ్న పత్రాలు కొనగలిగే పరిస్థితి దాపురిస్తుంది.తద్వారా సమాజం లో విద్య విలువ తెలియని వారు వివేకం, ప్రతిభ లేని లేనివారు పరీక్ష ల్లో మెదటి ర్యాంకు లు సాధిస్తే మరియు సమాజం లో డాక్టర్స్ గా, ఇంజనీర్లుగా ఆయా శాఖల్లో ఉద్యోగులుగా ఉన్నతధికారులుగా, అవగాహన లేని వారంతా అధికారులు గా అవతరించే అవకాశం ఉంది.
దీని మూలంగా సమాజం లో అత్యున్నత రాంగాలు సక్ర మార్గం వీడి అక్రమార్గం వైపు వైపు ప్రయాణం చేయవలసి వస్తుంది.
కావున పోటీ పరీక్ష లు మొదలుకొని నేటి పదవ తరగతి పరీక్ష ల ప్రశ్న పత్రాల లీకేజి వ్యవహారం పై ప్రభుత్వ ఉన్నతధికారులు వెంటనే ప్రత్యేక శ్రద్ద చూపి, ప్రశ్న పత్రాలా లీకేజి కి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని, తద్వారా ప్రతిభవంతులకు ఉన్నత చదువులు ఉద్యోగాల్లో న్యాయం చేయాలని కోరుచున్నాము..!!

Post A Comment: