మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రష్యాలో కార్మిక వర్గ నియంతృప్త రాజ్యాన్ని స్థాపించిన, ప్రపంచ పీడిత ప్రజల విముక్తి పోరాట యోధుడు,1917 రష్యాలో బోల్సివిక్ విప్లవాన్ని విజయవంతం చేసిన *కామ్రేడ్ వి.ఐ.లెనిన్153 వ, జయంతి, సీపీఐ (ఎం-ఎల్) 154 వ, ఆవిర్భావ దినంను ఘనంగా నిర్వహించారు
దోపిడీ వ్యవస్థను నిర్మూలించి దాని స్థానంలో, నూతన ప్రజాస్వామిక విప్లవం ను సాదించకుండా ప్రజలకు భూమి,బుక్తి, విముక్తి అనేది సాధ్యం కానేకాదని చెప్పి, ప్రజల విముక్తి కోసం వీరోచితంగా పోరాడి అసువులు బాసిన *అమర వీర యోధులకు*కామ్రేడ్ లెనిన్*కు రెండు నిమిషాలు సంతాప సూచకంగా మౌనం పాటించి ఘనంగా విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు మేరుగు చంద్రయ్య అద్యక్షత వహించగా *సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ(I K) మాట్లాడుతూ, దోపిడీ పాలక వర్గాల పల్లకిని మోసే, దోపిడీ విధానాలను బలపరుస్తూ, పాలక వర్గాలతో మమేకమై పోరాట పంథా నుండి, దీర్ఘకాలిక ప్రజా యుద్ద పంథా నుండి వైదొలగి, పార్లమెంటరీ పంథా ను చేపట్టిన సీపీఐ రివిజనిస్టు, సీపీఐ (ఎం) నయా రివిజనిస్టుల, తప్పుడు విధానాలను, విప్లవ, ప్రజా వ్యతిరేక ధోరణులను పార్లమెంట్ పంథా ను తిరస్కరించి,1968 లో సీపీఐ (ఎం) నుండి బయటికి వచ్చి,1969 ఏప్రిల్ 22 నాడు,మార్క్సిస్టు మహో పాద్యాయులు కామ్రేడ్ లెనిన్ జయంతిని పురస్కరించుకుని *సిపిఐ (ఎం-ఎల్)
ఆవిర్భవించిందని పేర్కొన్నారు. *రివిజనిస్టు,నయా రివిజనిస్టు పాలక వర్గ అనుకూల విధానాలను,పాలక వర్గాల దోపిడీకి ప్రత్యామ్నాయంగా,పోరాట పంథాను చేపట్టిన *సీపీఐ (ఎం.ఎల్)పార్టీ, దేశంలో అనేక చెప్పుకోదగ్గ ముఖ్యంగా, దున్నే వారికే భూమి కేంద్ర నినాదంతో దేశంలో లక్షలాది మిగులు, ప్రభుత్వ,తదితర అనేక రకాల భూములను ప్రజల భాగస్వామ్యంతో పోరాడి సాధించిందని పేర్కొన్నారుఈ సందర్భంగా పార్టీ జెండాను మండల సహాయ కార్యదర్శి మేరుగు చంద్రయ్య ఎగురవేశారు*ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి, కొల్లూరి మల్లేశ్, "పి ఓ డబ్ల్యూ" జిల్లా అద్యక్షులు కోడిపుంజుల జ్యోతి,నాయకలు వేల్పుల సాంబన్న, ఉప్పులేటి నర్సన్న, బి ఆనంద్ , టి రాజకొమురయ్య, ఆరుమూళ్ళ తిరుపతి, సమ్మెట తిరుపతి, మాలం తిరుపతి, దేవి శంకర్, కె కర్నాకర్ బి సాగర్, బి మహెందర్, ఎన్ రమేష్, ఎస్ రాంచంద్రం, బి రామస్వామి, కోడిపుంజుల చంద్రయ్య, M రజిత, పి సుమతి, కె నర్సమ్మ, యు భూమక్క, యం శంకరమ్మ, పి అమ్రృతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: