మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఎన్ టి పి సి సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా ఆధ్వర్యంలో మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ 153వ జయంతి సభ జరిగింది. ఈ సభలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ

మహాపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ 153వ పుట్టిన రోజు ఏప్రిల్ 22. రష్యన్ బోల్షివిక్ నిర్మాతగా, రష్యా అక్టోబర్ విప్లవ సారధిగా,మార్క్సిజాన్ని సామ్రాజ్యవాద యుగానికి వర్తింపచేసిన మార్కిస్టుమహాపాధ్యాయుడిగా కార్మిక వర్గ ఉ ద్యమానికి, కమ్యూనిస్టు విప్లవోద్యమానికి సైద్ధాంతిక భూమికను జోడించిన మహనీయుడిగా, సిద్ధాంతవేత్తగా, విప్లవనేతగా |కా|| లెనిన్ అందరికీ తెలిసినవాడు.

అలానే భారతదేశంలో 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. మరో రెండేళ్ళలో శత జయంతిని జరుపుకోవాల్సి

వుంది. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ కార్మిక, కర్షక, పీడిత వర్గ పొత్తిళ్ళలో పెరిగింది ఎదిగింది. నిర్భందాలు.

ఆంక్షల మధ్య ధృఢంగా నిలబడింది. కుట్ర కేసులను, జైళ్ళను ఎదుర్కొన్నది. వేలాది మంది కమ్యూనిస్టు విప్లవోద్యమంలో

అసువులు బాసారు. ఉరికంబాలకు ఎక్కారు. జైలు గోడల మధ్య ఊపిరి వదిలారు. ఎన్ కౌంటర్లు, భూస్వామ్య, ధనస్వామ్య

గుండాల దాడులలో నేలకొరిగారు.

అంతేగాక భారత కమ్యూనిస్టు పార్టీ మహత్తరమైన ఎన్నో పోరాటాలను చేసింది. కార్మికవర్గ పోరాటాల కోసం తెగించి సమ్మెలు నడిపింది. పని గంటల తగ్గింపు నుంచి, వేతనాల పెంపు వరకూ, వివక్ష నుంచి అన్యాయాలను అరికట్టే వరకు ఎన్నో విజయాలు సాధించింది. మిల్లుల నుంచి రైల్వేల దాకా, సంఘటిత రంగం నుంచి, అసంఘటిత రంగం దాకా కార్మికవర్గ నేతగా కమ్యూనిస్టు పార్టీ నిలిచింది.

అలానే వ్యవసాయ కూలీలను, పాలేర్లను సంఘటితం చేసి పోరాడింది. వెట్టి చాకిరి, బానిసత్వం నుంచి విముక్తికై

పోరాడింది. మహిళలను సంఘటితపరిచి, పోరాటాలలో, జీవితంలో, సమాజంలో సమానం అంటూ చాటి చెప్పింది.

విద్యార్థి, యువజన, మేధో వర్గాలను కూడగట్టి పోరాటాలు నడిపింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మొట్టమొదటిగా

సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఆంగ్లేయ సామ్రాజ్యవాదంకు వ్యతిరేకంగా, వలసవాదం

నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యంకై మిలిటెంట్ పోరాటాలను నడిపింది.

అలానే ఫ్యూడల్ భాగస్వామ్య, జమీందారీ, జాగీర్దారి విధానం నిర్మూలించడానికి సంస్థానంలో సంఘ నిర్మాణం నుంచి ఆరంభించి సాయుధ పోరాటాలు నడిపింది. 

కమ్యూనిస్టు పార్టీది వీరోచిత చరిత్ర. ఈ చరిత్రకు వారసత్వం విప్లవోద్యమానిది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా, జాతీయంగా కమ్యూనిస్టు ఉద్యమంలో తలెత్తిన రివిజనిజం, మితవాదం భారత కమ్యూనిస్టు పార్టీని పార్లమెంటరీ పంథాకు కుదించింది. పార్టీ వర్గ సామరస్యాన్ని అవలంభించింది. వర్గ పోరాట కీలక కర్తవ్యాన్ని విస్మరించింది. ఈ క్రమంలో జరిగిన అంతర్గత పోరాటంలో నుంచి 1964లో సీపీఐ (యం) ఏర్పడింది. అది కూడా పార్లమెంటరీ పంథాకే తలవొగ్గింది. కేరళ, బెంగాల్ మార్గమే మన మార్గమని ప్రకటించింది. పాలక వర్గాల వైరుధ్యం వుపయోగించుకునే పేరిట పాలక వర్గాలతో చెట్టాపట్టాలు వేసుకుని నడిచింది. ఈ క్రమంలో ఆ విధానాలకు వ్యతిరేకంగా 1967లో నగ్జల్బరీల కౌలు రైతుల హక్కుల కోసం పోరాటం బ్రద్దలయ్యింది.ఈ క్రమంలో అంతర్జాతీయంగా, జాతీయంగా కమ్యూనిస్టు ఉద్యమంలో తలెత్తిన రివిజనిజం, మితవాదం భారత కమ్యూనిస్టు పార్టీని పార్లమెంటరీ పంథాకు. కుదించింది. పార్టీ వర్గ సామరస్యాన్ని అవలంభించింది. వర్గ పోరాట కీలక కర్తవ్యాన్ని విస్మరించింది. ఈ క్రమంలో జరిగిన అంతర్గత పోరాటంలో నుంచి 1964లో సీపీఐ (యం) ఏర్పడింది. అది కూడా పార్లమెంటరీ పంథాకే తలవొగ్గింది. కేరళ, బెంగాల్ మార్గమే మన మార్గమని ప్రకటించింది. పాలక వర్గాల వైరుధ్యం వుపయోగించుకునే పేరిట పాలక వర్గాలతో చెట్టాపట్టాలు వేసుకుని నడిచింది. ఈ క్రమంలో ఆ విధానాలకు వ్యతిరేకంగా 1967లో నగ్జల్బరీల కౌలు రైతులు హక్కుల కోసం పోరాటం బ్రద్దలయ్యింది. బంగ్లా కాంగ్రెస్తో కలిసి మిశ్రమ మంత్రి వర్గం ఏర్పరచుకున్న సీపీయం ఈపోరాటాన్ని నెత్తురు బేరుల్లో ముంచింది. ఈ వారసత్వంలో శ్రీకాకుళం, బీర్బూమ్, గోభివల్లభపూర్ రైతాంగ పోరాటాలు

తలెత్తాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీల పార్లమెంటరీ పంథాపైన, పాలక వర్గాలతో కలసిన మితవాద ఆచరణపైన తిరుగుబాటుగా చేసి ఆ పార్టీలలోని విప్లవకారులు బయటకు వచ్చారు. అంతర్జాతీయంగా రష్యా, చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య జరిగిన గ్రేట్ డిబేట్ కూడా దీనికి తోడ్పడింది. మొదట అఖిల భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ కమిటీగా ఏర్పడ్డారు. చారుముజుందార్, కానూ సన్యాల్, తదితరుల నాయకత్వంలో ఏ.పి.లో కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి. దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, తదితరులు సమన్వయ కమిటీలో చేరారు. తరువాత వారిని అతివాద వాగాడంబరంతో అవమానకరంగా ఎఐసీసీఆర్ నుంచి బహిష్కరిస్తే - ఆంధ్రా కమ్యూనిస్టు విప్లవకారుల కమిటీగా ఏర్పడ్డారు. ఈ క్రమంలోనే కానూసన్యాల్, చారుమజుందార్, సరోజ్ దత్తా తదితరులు 1969 ఏప్రిల్ 22న సీపీఐ (యం.యల్) ఏర్పాటును ప్రకటించారు. అనేక విభేదాలున్నా 1969లో దేశవ్యాపితంగా వున్న విప్లవశక్తులు సీపీఐ (యం.యల్)లో చేరారు. కా॥ సత్యనారాయణ సింగ్ 1970-72లోనే వారితో తెగతెంపులు చేసుకున్నాడు. నగ్జల్బరీ, శ్రీకాకుళం ఇతర ఉద్యమాలు వ్యక్తిగత సాయుధ చర్యలుగా మార్చిన ఫలితంగా ఉద్యమం దెబ్బతిని పోయింది.

అయినా 1969 రివిజనిజం మీద, పార్లమెంటరీ పంథాకు వ్యతిరేకంగా విప్లవకారులు ఒక పార్టీగా సీపీఐ (యం.యల్) ను ఏర్పరచుకున్న రోజు. అయితే ఈ విప్లవోద్యమం మితవాదం, అతివాదంకు గురయింది. ముఖ్యంగా అతివాద అరాచకవాదంతో దెబ్బతిన్నది. చైనా పంధాను మక్కీకి మక్కీగా అమలు చేయాలని ప్రయత్నించి విఫలమయ్యింది. భారతీయ పరిస్థితులనూ, మార్పులనూ, పెట్టుబడిదారీ విధానం పెరిగిన తీరునూ, కార్మికవర్గం పెరిగిన తీరునూ, కేంద్రీకృతం 'రాజ్యం, బూర్జువా పార్లమెంటు తదితర విషయాలను పరిగణనలోనికి తీసుకోకుండా చైనా పంథాయే మన పంధా అని జడాత్మకంగా అందరూ భావించారు. ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా ఆ పోరాటం సాయుధ పోరాటం స్థాయికి ఎదగలేదు. సరికదా కుంచించుకు పోయింది. సరైన పంథా కోసం అంతర్గత పోరాటం జరుగుతూనే వున్నది. ఈ క్రమంలోనే జణాత్మక విధానం నుంచి, యాంత్రికతల నుంచి, అతివాద వాగాడంబరపు నినాదాల నుంచి, మితవాద ఆచరణ నుంచి విడగొట్టుకుని సీపీఐ (యం.యల్) ప్రజాపంధా ఏర్పడింది.

వందేండ్లు సమీపిస్తున్న భారత కమ్యూనిస్టు విప్లవోద్యమానికి, 55 ఏండ్ల కాలం నుంచి పార్లమెంటరీ పంథా నుంచి విడగొట్టుకున్న విప్లవోద్యమానికి, అతివాద అవకాశ విధానాల నుంచి ప్రజాపంధాలో ఉద్యమ నిర్మాణం సాగాలని అనేక విప్లవ శక్తులు పోరాడుతున్నాయి. భారతీయ ప్రజాస్వామిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమం నడపాల్సి వున్నది. మోడీ

తీసుకువస్తున్న ఫాసిజానికి వ్యతిరేకంగా ముందుగా విప్లవ కమ్యూనిస్టు పార్టీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. ఇంకా *ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్,జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, అడేపు శంకర్, కోడిపుంజుల లక్ష్మి, గొల్లపల్లి చంద్రయ్య మార్త రాములు, కట్ట తేజేశ్వర్ తీగుట్ల రాములు తూళ్ళ శంకర్, మార్త రాద, కొట్టే స్వరూప, కలవల రాయమల్లు, ఏ సారయ్య పి రాజేందర్ గుండ్ల పోశం గొట్టే లక్ష్మీనారాయణ, ఓ సబితా జీ సమ్మక్క ఆడెపు సుధాకర్, శ్రీనివాస్, శ్రీధర్ నరేష్, సిహెచ్ ప్రమీల, ఆర్ కళావతి, పి లక్ష్మి వసంత భాను, టి రాధ శంకర్ , కుమార్ , ఏ రమా, శైలజ,తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: