చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
యువత సామాజిక బాధ్యతగా ప్రతి
ఒక్కరు రక్తదానం చేయాలని రక్తదానం ప్రాణదానంతో సమానమని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆయాన్న్ భార్గవ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నివ్య హాస్పిటల్ వారి సౌజన్యంతో తోర్పునూరి నరసింహ పుట్టినరోజు రెండవసారి 13వ వార్డులో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ను సోమవారం ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రెడ్డి,
వరల్డ్ రికార్డు బ్లడ్ డోనర్ డాక్టర్ సంపత్ కుమార్ జబర్దస్త్ ఫ్రేమ్ వాసు వన్స్
మోర్ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయాన్న్ భార్గవ్
సేవ ట్రస్ట్ చైర్మన్ మురళి ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి
యువతను ప్రోత్సాహం అందిస్తున్న సేవ ట్రస్ట్ చైర్మన్ మురళిని అభినందించారు. అలాగే ప్రతి ఒక్కరు విధిగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. ఈ రక్తదానంలో స్వచ్ఛందంగా 100కు పైగా రక్తదానాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాను ప్రకాష్, భాను ప్రకాష్ భరత్ రిజ్జు, మున్నా శ్రీకాంత్ రెడ్డి శివ శ్రీకాంత్ సుధీర్ సుభాష్ పాల్గొన్నారు.
Post A Comment: