మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలు , విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెల ప్రారంభమై 10 రోజులు గడిచినా టీచర్లకు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, ఎయిడెడ్, మోడల్ స్కూల్ సిబ్బంది వేతనాలు చెల్లించలేదని మండిపడ్డారు. రెండేండ్లుగా నెల మొదటి పనిదినం నుంచి పదో తేదీ మధ్య రొటేషన్ పద్ధతిలో రోజూ కొన్ని జిల్లాల చొప్పున వేతనాలు జమయ్యేవని, ఈనెల ఎప్పుడు జమ అవుతాయో తెలియని అయోమయం ఉపాధ్యాయుల్లో, విశ్రాంత ఉద్యోగుల్లో నెలకొందన్నారు. ఉద్యోగులు, టీచర్లు ఇంటి కోసం ,చదువుల కోసం, తీసుకున్న బ్యాంకు ఋణాల ఈఎంఐలు ప్రతినెల 5, 10 తేదీల్లో చెల్లించాల్సి ఉంటుందని, గడువు లోపు ఈఎంఐ కట్టడానికి ఖాతాలో డబ్బు లేక పెనాల్టీతో కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీపీఎఫ్ సొమ్ము తీసుకుందామనుకుంటే సకాలంలో వారికి అందట్లేదన్నారు. నెల మొదటి తేదీనే వేతనాలు, పెన్షన్లు, నిర్ణీత గడువులోగా సప్లిమెంటరీ బిల్లులు విడుదల చేయాలని కోరారు..

Post A Comment: