పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:ఏప్రిల్:16:రిపోర్టర్ పొన్నం శ్రీకాంత్ గౌడ్ ఆత్మహత్యకు కారకులైన దుండగులను కఠినంగా శిక్షించాలి,పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వార్త రిపోర్టర్ పొన్నం శ్రీకాంత్ గౌడ్ ఆత్మహత్య పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన రామగుండం ప్రెస్ క్లబ్ సభ్యులు ఆదివారం రాత్రి ప్రెస్ క్లబ్ నుండి గోదావరిఖని ప్రధాన చౌరస్తా అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పొన్నం శ్రీకాంత్ గౌడ్ కి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు,పలువురు మాట్లాడురు పొన్నం శ్రీకాంత్ గౌడ్ ను కొందరు దుండగుల వేధింపుల కారణంగా గురువారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకుని అకాల మరణం చెందడం విచారకరమని తన ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని,శ్రీకాంత్ ఆత్మహత్యకు బాధ్యులైన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు స్వేచ్ఛాయుతంగా వార్తలు రాసుకునే పరిస్థితి లేకుండా పోతున్నదని వివిధ రాజకీయ పార్టీల నాయకులు,మాఫియాలు కేసులు పెడదామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని,ఇలాంటి చర్యలు తగవని అన్నారు.జర్నలిస్టులు ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలకు దూరం కావద్దని సూచించారు,ఎవరికైనా,ఎవరి నుంచి వేధింపులు ఎదురైనట్లయినా,బెదిరింపులకు పాల్పడినా ప్రెస్ క్లబ్,యూనియన్ దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించే దిశగా చేసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.ఆత్మహత్య చేసుకున్న రిపోర్టర్ పొన్నం శ్రీకాంత్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ జమీల్ హుస్సేన్,ప్రధాన కార్యదర్శి పర్కాల లక్ష్మీనారాయణ గౌడ్,వైస్ ప్రెసిడెంట్ అంజయ్య యాదవ్,కోశాధికారి రవీందర్,ఆర్గనైజ్ సెక్రెటరీ కల్వల అనిల్ కుమార్,ప్రచార కార్యదర్శి దారా మధు,కార్యవర్గ సభ్యులు ఆవుల రాజేష్,కాపరబోయిన సతీష్,కలవేని జీవన్,పుట్ట రాజన్న,ఏదుల వివేక్,ప్రెస్ క్లబ్ ఇన్చార్జి వెన్నెల శీను,జర్నలిస్టు మిత్రులు గాజుల రమేష్,చిప్పకుర్తి తిరుపతి,మంద రవికుమార్,బోయ రాజు,దాసరి లక్ష్మణ్,ఇంజo సాంబశివరావు,నీలం కుమారస్వామి,మాతంగి శివరాజ్,జాడి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: