మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
BRS మంత్రులకు,నాయకులకు కేంద్రం మీద తప్పుడు ప్రచారం చేయడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు పై ఏమాత్రం లేదని ఈ అసమర్థ పాలనలో ఇంక ఎన్ని ఘోరాలు చూడవలసి వస్తుందో అని బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ అన్నారు.
TSPSC పేపర్ లీకేజీ నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే,మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యం లో రామగుండం నియోజకవర్గం లోని గోదావరిఖని చౌరస్తాలో TSPSC పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బాధ్యులైన వారిని బర్తరఫ్ చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ పాల్గొని వారు మాట్లాడుతూ
అయిన వారిని విడిచి నానా కష్టాలు పడి చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి కన్నవారి ఆశలు నెరవేర్చాలని ఎదురుచూసే విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆలోచించకుండా కొంతమంది బడా బాబుల పిల్లల కోసం అందరి ఆశలు ఆశయాలతో చేలగాటమాడడం ఎంతవరకు సమంజసం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
భారతీయ జనతాపార్టీ రామగుండం నియోజకవర్గం పక్షాన వేంటనే TSPSC అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ, రామగుండం బూత్ సశక్తీకరణ్ అసెంబ్లీ ఇంచార్జ్ బోడకుంట సుభాష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బద్రి దేవేందర్, బి ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, బిజెపి మహిళ నాయకులు కుసుమ, మాతంగి రేణుక, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మండ నారాయణరెడ్డి, పత్తి సంజీవ్, మిట్టపల్లి సతీష్, దాసరి శ్రీనివాస్, జనగామ రాయలింగు, గుడిసెల కమలాకర్, సంపంగి శ్రీనివాస్, బుంగ మహేష్, బండి రాము ,మాదాసి రాజేశం, ఐట్ల సాగర్, బండి పెళ్లి చంద్రయ్య, పావల విజయపాల్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: