ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల సంక్షేమానికి అన్ని రంగాల్లో అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్  విప్, హన్మకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మంగళవారం హన్మకొండ బాలాసముద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని మహిళ మణులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ నియోవర్గం లోని ప్రతి డివిజన్ లోని  ఉన్న మహిళలు ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సమావేశం మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా చీఫ్ విప్  దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఆయన తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మహిళల అభివృద్ధి పట్ల, వారి సంక్షేమం పట్ల, ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహించుకోవడం పట్ల సైతం చిత్తశుద్ధి కనపర్చలేదని ఆరోపించారు. అందుకు భిన్నంగా మన బిఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం మహిళల సంక్షేమానికి పెద్దపీఠం వేస్తూ వారికి అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్, బిఆర్ఎస్ ప్రభుత్వం లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మహిళ లంత సమిష్టిగా పండుగ వాతావరణం లా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు.

ఈ మహిళ దినోత్సవం రోజున మున్సిపాలిటీ సిబ్బందికి క్రీడలు నిర్వహించి సన్మానించడం జరిగిందని సూచించారు. నేడు కాకతీయ యూనివర్సిటీ లో రాష్ట్ర మహిళ కమిషనర్, రాష్ట్ర మంత్రులతో పెద్ద ఎత్తున మహిళ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా వివిధ శాఖల్లోని ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు, డివిజన్ లోని మహిళలు వారి ప్రతిభ కనబర్చిన వారందరికీ బహుమతులు,మోమెంటోలు అందించి, శాలువలతో సత్కరించటం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ జన్మదిన పురస్కరించుకుని క్రీడలు నిర్వహించినట్లు ఈ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళ  ఉద్యోగుల ల్లో ఆశ వర్కర్లకు, మున్సిపాలిటీ సిబ్బందికి వారికి ఒకరోజు కేటాయించి క్రీడలు ఏర్పాటు చేసి అందరిని సన్మానించుకోవడం జరుగుతుందని తెలిపారు.మహిళ ఆరోగ్యం పట్ల  2రోజుల పాటు ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై నిరసిస్తూ పెద్ద ఎత్తున మహిళలంత కలిసి  అంబేద్కర్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చెర్మన్ సంఘం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ కో-కన్వీనర్ తాల్లపెళ్లి జనార్ధన్ గౌడ్,జిల్లా గ్రంధాలయ సంస్థ చెర్మన్ ఎండి.అజీజ్ ఖాన్, మహిళ కార్పొరేటర్లు, మహిళ డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: