మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఓబి కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చేపట్టుతున్న సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గోదావరిఖని ఫైవ్ ఇంక్లైన్ పార్క్ నుంచి జిఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టడం జరిగింది. ర్యాలీకు ముందు పోలీసులతో వాదనలు జరిగాయి. రాస్తారోకోకు బయలుదేరిన నాయకులతో పోలీసు అధికారులు చర్చించడం జరిగింది. దీంతో జిఎం కార్యాలయం ముందు ధర్నాకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా *ఓబీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కౌశిక్ హరి, బుర్ర తిరుపతి, వేల్పుల కుమారస్వామి, పూసాల తిరుపతి, ఏ వెంకన్న ,తోకల రమేష్, మద్దెల శ్రీనివాస్, కట్ట విశ్వనాథ్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం, ఓబీ కాంట్రాక్టర్లు కలిసి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తే ప్రతిఘటన తప్పదు. ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకువచ్చి పనులు చేపించాలని చూస్తే జరగబోయే పరిణామాలకు సింగరేణి యాజమాన్యం ఓబి కాంట్రాక్టర్లు బాధ్యత వహించాలి. సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తే సింగరేణి వ్యాప్తంగా సమ్మెను విస్తరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. వెంటనే ఓబి కాంట్రాక్టర్లు సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు రావలసిన చట్టప్రకారం వేతనాలకై ముందుకు రావాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగుతుందని, యాజమాన్యాలు దిగివచ్చేదాకా పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఆర్ జీ వన్ జనరల్ మేనేజర్ కలువల నారాయణ ధర్నా ప్రాంతానికి వచ్చి సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతున్నామని, సమస్య పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో ఉన్నామని కార్మికుల ప్రశాంతంగా ఉండాలని కోరడం జరిగింది.ఇంకా *ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గోపగాని నవీన్ గౌడ్, నిమ్మ రాజుల రవి, బీఎస్పీ నాయకులు ఇరికిళ్ళ రాజనరసయ్య లతోపాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Home
Unlabelled
సమ్మె విచ్ఛిన్నం చేయాలని చూస్తే సింగరేణి వ్యాప్తంగా సమ్మెను విస్తరిస్తాం.ఓబి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరిక.
Post A Comment: