ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

స్మార్ట్ సిటీ పనులలో వేగం పెంచాలని    హన్మకొండ  కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.

  బుధవారం కుడా కార్యాలయం లోని సమావేశమందిరంలో కుడా, స్మార్ట్ సిటీ, బల్దియా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్ల తో స్మార్ట్ సిటీ పనుల పురోగతిని కమీషనర్ ప్రావిణ్య తో కలిసి సమీక్షించి నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయుటకు  తగు సూచనలు చేశారు. ప్రస్తుతం బల్దియా పరిధి లోని వివిధ ప్రాంతాల్లో  కొనసాగుతున్న స్మార్ట్ రోడ్ పనుల పురోగతి, నగరానికి  నాలుగు వైపులలో ఏర్పాటు చేస్తున్న గ్రాండ్ ఎంట్రన్స్ (ముఖ ద్వారాలు) నిర్మాణ పనులతో పాటు కొనసాగుతున్న భద్రకాళి బండ్ పనులైన ఫుడ్ కోర్డ్ పనులు, మరుగుదొడ్ల ఏర్పాటు పనులు,గ్రీనరి పనుల పురోగతి పనులు, వడ్డే పల్లి బండ్ పై కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ పనులు, సియాస్క్ పనులు, స్తైయిర్ కేస్ పనుల పురోగతి, ఉర్సు వద్ద కొనసాగుతున్న గణేష్ నిమజ్జన ట్యాంక్ పనులు, అజార హాస్పిటల్ వద్ద నిర్మిస్తున్న కల్వర్టు రీటైనింగ్ వాల్ పనులు, ప్రెసిడెన్సీ స్కూల్ వద్ద కల్వర్టు నిర్మిత పనులు, బాల సముద్రం,పోతన నగర్ లో కొనసాగుతున్న ద్వితీయ చెత్త తరలింపు కేంద్ర నిర్మాణ పనులు, అమ్మవారి పేట లో 150 ఎం.ఎల్.డి. కెపాసిటీ తో ఏర్పాటు చేస్తున్న ఎఫ్.ఎస్.టి.పి. పనుల పురోగతి, 5 ఎం.ఎల్.డి,15 ఎం.ఎల్.డి. సామర్థ్యం తో  కొనసాగుతున్న ఎస్.టి.పి. పనులు, బయో మైనింగ్ పనుల పురోగతి పై సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భం గా కమీషనర్  మాట్లాడుతూ గుత్తేదారులు మెన్ అండ్ మెటీరియల్ పెంచి అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా చూడాలని, పూర్తయిన పనులకు బిల్లుల చెల్లించడం జరుగుతుందని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు.

ఈ  కార్యక్రమంలో ఎస్. ఈ . ప్రవీణ్ చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, కుడా .పి. ఓ.అజిత్ రెడ్డి, సి.ఎం.హెచ్. ఓ.డా.రాజేష్,సి.హెచ్. ఓ.శ్రీనివాస రావు, ఈ.ఈ.లు రాజయ్య, బి.ఎల్. శ్రీనివాస రావు,డి.సి.పి.ప్రకాష్ రెడ్డి,స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి, ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: