మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
బెల్లంపల్లి: పట్టణంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపంతో నే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియాకు చెందిన, కాపెల్లి శివకృష్ణ (18) ప్రగతి జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న శివకృష్ణ గురువారం తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. శివకృష్ణను పరీక్ష కేంద్రం వద్ద దింపిన తర్వాత, తల్లిదండ్రులు మంచిర్యాలకు వెళ్ళిపోయారు. ఈరోజు సంస్కృతం పరీక్ష రాసి వచ్చిన శివకృష్ణ తల్లి శారదకు ఫోన్ చేసి పరీక్ష సమయంలో కడుపునొప్పి వచ్చిందని చెప్పాడు. అందుకే పరీక్ష బాగా రాయలేకపోయానని, బాధపడుతూ తల్లితో చెప్పాడు.దీంతో తల్లి శారద ఏం కాదులే బాధపడకు అని సర్ది చెప్పింది.ఫోన్లో అతని మాటలు విన్న తల్లిదండ్రులు అనుమానం వచ్చి పక్క వారికి ఫోన్ చేసి శివకృష్ణను చూడమని చెప్పగా ఇంట్లో ఉరి వేసుకుని శివకృష్ణ కనిపించాడు.దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పంచనామ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు....

Post A Comment: