మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రానున్న ఎన్నికల దృష్ట్యా తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా ఉందని బిజెపి అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి అన్నారు. రామగుండం నియోజక వర్గం లోని స్థానిక శారదా నగర్ సరస్వతి శిశుమందిర్ అవరణలో ప్రముఖ విద్యావేత్త,న్యాయవాది, అనలిస్ట్ పోరెడ్డి కిషోర్ రెడ్డిచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పై అవగాహనా సదస్సు మరియు చర్చా గోష్టి కార్యక్రమం రామగుండం నియోజకవర్గ మేధావులతో ఏర్పాటు చేయటం జరిగింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ అమృతకాలంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీగా ఎక్కడ నిలబెడుతుందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మేధావులకు, న్యాయవాదులకు, నాయకులకు, కార్యకర్తలకు బడ్జెట్ విశ్లేషణ వివరించడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అసలు పొంతన లేకుండా ఉన్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రజలను మోసం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం లోని మేధావులు, న్యాయవాదులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

Post A Comment: