ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తనపై నమ్మకంతో హన్మకొండ జిల్లా ఆర్టీఏ మెంబర్ గా మరల అవకాశం కల్పించినా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ని మరియు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ని మర్యాదపూర్వంగా కలిసి పూల మొక్క అందించి
గండి రాజు (కటాపుర్ రాజు) కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తన పై నమ్మకంతో మళ్లీ ఆర్టీఏ మెంబర్ గా అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలుపుతూ వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.
మంత్రిని కలిసిన వారిలో కాజీపేట రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంచు కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు బస్వ యాదగిరి, రఘు ఉన్నారు.

Post A Comment: