ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంధ్యా రాణిలతో కలిసి గురువారం భద్రకాళి దేవాలయం ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ఈవో శేషు భారతి ప్రధాన అర్చకులు శేషాచార్యులు పూర్ణకుంభం స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు చేయించారు. తీర్థ ప్రసాదాలు, అమ్మ వారి పట్టు వస్త్రాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి దేవాలయ చరిత్రను ఆలయ అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమం లో డిఆర్ఓ వాసు చంద్ర ఎంఆర్వో
రాజకుమార్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
అంతకు ముందు అదనపు కలెక్టర్ సంధ్యా రాణి కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే ను అందజేశారు.


Post A Comment: